నంద్యాల లో కిసాన్ మేళా “
1 min readపల్లెవెలుగు వెబ్ నంద్యాల: ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం” ఆధ్వర్యంలో తే 18.12.2024 ది న ప్రాoతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, నంద్యాల లో ” కిసాన్ మేళా’ను నిర్వహిస్తున్న సందర్భంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, ఏ.డి.ఆర్ సమావేశ భవనం నందు “ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో డా. ఎం. జాన్సన్, సహ పరిశోధన సంచాలకులు, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాల మాట్లాడుతూ: ‘కిసాన్ మేళ’ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా అచ్చెన్నాయుడు , సభా ద్యక్షులుగా పయ్యావుల కేశవ్ , విశిష్ట అతిధులు ఎన్.ఎం.డి. ఫరూక్ . బి.సి. జనార్ధన్ రెడ్డి , మరియు టి. జి. భరత్, శ్రీమతి బైరెడ్డి శబరి లు పాల్గొంటున్నారని డాక్టర్ ఎం జాన్సన్, సహ పరిశోధన సంచాలకులు పత్రికా ముఖంగా తెలియ జేసారు .ఈ కార్యక్రమంలో భాగంగా రైతుల కోసం వ్యవసాయ ప్రదర్శన ను వ్యవసాయ అనుబంధ శాఖలు కలసి నిర్వహిస్తున్నట్లు, అలాగే విత్తన, పురుగు మందులు, ఎరువులు మరియు వ్యవ సాయ పనిముట్లు, డ్రోన్లు, ట్రాక్టర్స్ కంపెని వారు కలసి ’70’ స్టాల్స్ ను ఏర్పాటు చేస్తు న్నారని, “సేంద్రీయ వ్యవసాయం మరిము ప్రకృతి వ్యవసాయం” ప్రదర్శనను కూడా ఏర్పాటు చేస్త్నుట్లు, ఈ కార్యక్రమంలో రైతులు 1500 మంది విద్యార్థులు : 300 మంది, ఎన్. జి. ఓ లు, ఎఫ్. పి. వి లు, మరియు నాలుగు జిల్లాల నుండి (నంద్యాల, కర్నూలు అనంతపూర్ పుట్టపర్తి) కె.వి.కె. శాస్త్రవేత్తలు, డాట్ సెంటర్స్ శాస్త్రవేత్తలు పాల్గొంటున్నట్లు తెలియజేశారు. కావున రైతులు తే 18.12.2024 ది న జరగబోవు “కిసాన్ మేళా” మరియు ‘ వ్యవసాయ ప్రదర్శన ను సద్వి నియోగం చేసుకొని వ్యవసాయ పరిజ్ఞానాన్ని మరియు ఆధునిక వ్యవసాయ సాంకేతిక లో రైతులు అవగాహన కల్పించుకొని ఈ “కిసాన్ మేళా” ను విజయ వంతం చేయాలని డా. ఎం జాన్సన్, సహ పరిశోధన సంచాలకులు, ఆర్.ఎ.ఆర్. ఎస్. నంద్యాల రైతులను మరియు వ్యవసాయ అనుబంధ శాఖలను కోరారు.
డాక్టర్ ఏ రామకృష్ణారావు ప్రిన్సిపల్ సైంటిస్ట్ (సస్యరక్షణ)ఆర్.ఎ. ఆర్ .ఎస్
నంద్యాల మొబైల్: 98660 21755.