నిశ్చితార్థ వేడుకలో వైస్ చైర్మన్ రబ్బానీ..
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో సత్యనారాయణ కళ్యాణ మండపంలో శనివారం మధ్యాహ్నం జరిగిన నిశ్చితార్థ వేడుక కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నందికొట్కూరు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మొల్ల రబ్బానీ హాజరయ్యారు. నందికొట్కూరు పట్టణానికి చెందిన 6వ వార్డ్ ఇంచార్జి దేశెట్టి శ్రీనివాసులు సోదరుడు దేశెట్టి శివ సుబ్బయ్య కుమార్తె యురేఖ మరియు అనంతపురం జిల్లా పామిడికి చెందిన వరుడు రవితేజ నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరై వైస్ చైర్మన్ రబ్బానీ ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో 6వ వార్డ్ కౌన్సిలర్ దేశెట్టి సుమలత, వార్డ్ ఇంచార్జి శ్రీనివాసులు,శివ సుబ్బయ్య,సోషల్ మీడియా ప్రతినిధి పసుల శ్రీనివాసులు నాయుడు మరియు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు హాజరయ్యారు.