ప్రశాంతంగా ముగిసిన సాగునీటి సంఘం ఎన్నికలు….
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: సాగునీటి సంఘం – 4 అధ్యక్షునిగా మిక్కిలినేని వెంకట శివప్రసాద్…3 వ సాగునీటి సంఘం అధ్యక్షునిగా బి.ఉస్మాన్..ఉపాధ్యక్షులుగా సిద్ధిక్ సాబ్, జొండే రామచంద్ర..హోళగుంద మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సాగునీటి సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉత్కంఠగా సాగిన ఈ ఎన్నికల్లో సాగునీటి సంఘం – 4 అధ్యక్షునిగా మిక్కిలినేని వెంకట శివప్రసాద్,సాగునీటి సంఘం -3 సెక్షన్ కు అధ్యక్షునిగా బి.ఉస్మాన్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా జొండే రామచంద్ర, సిద్దిక్ సాబ్ లు ఎన్నికయ్యారు.3 మరియు 4 సెక్షన్ లలో ఒక్కో సెక్షన్ లో 12 మంది సభ్యుల చొప్పున ఎన్నుకున్నారు. ఎన్నికైన అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సభ్యులను గ్రామస్తులు, కూటమి నాయకులు ఘనంగా సన్మానించారు. అనంతరం సాగునీటి సంఘం అధ్యక్షునిగా ఎన్నికైన మిక్కిలినేని వెంకట శివప్రసాద్ మాట్లాడుతూ రైతులకు సాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, కల్వర్టులు, వాటర్ డివైడింగ్ పాయింట్ లను బోర్డ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి మరమ్మత్తులు చేసి రైతులకు సాగునీటి ఇబ్బంది లేకుండా చేస్తామని అన్నారు.అదేవిధంగా గజ్జహల్లి గ్రామంలో నిర్వహించిన సాగునీటి సంఘం – 5 సెక్షన్ ఎన్నికల్లో అధ్యక్షునిగా తిక్కప్ప ఎన్నికయ్యారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆదోని ట్రాఫిక్ సిఐ సుబ్బారావు, హోలగుంద ఎస్సై బాల నరసింహులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు రాజా పంపన్న గౌడ్, మండల తెదేపా కన్వీనర్ తిప్పయ్య, మురళి, గోవింద్ గౌడ్,కాడప్ప, పంపాపతి,అబ్దుల్ సుబాన్,డిఎస్ బాషా,దిడ్డి వెంకటేష్, అబ్దుల్ రెహ్మాన్, సిబిఎన్ ఆర్మీ ముల్లా మోయిన్ కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.