సత్వర కేసుల పరిష్కారం లోక్ అదాలత్ ధ్యేయం
1 min readజూనియర్ సివిల్ జడ్జి రాహుల్ అంబేడ్కర్ జాతీయ లోక్ అదాలత్ లో 35 కేసులు పరిష్కారం.
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: రాజీ మార్గమే రాజ మార్గం అని జూనియర్ సివిల్ జడ్జి రాహుల్ అంబేడ్కర్ అన్నారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టు లో శనివారం మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ జరిగింది. జడ్జి ఇరు వర్గాల కక్షిదారులను విచారించి 35 కేసులను పరిష్కరించినట్లు క్లర్క్ రాఘవేంద్ర తెలిపారు. ఇందులో 29 ఐపీసీ క్రిమినల్ కేసులు, 4 సివిల్ కేసులు, భరణం కేసు- 1, గృహ హింస కేసు -1 ఉన్నాయని ఆయన తెలిపారు. సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు లో 385 పెట్టీ కేసులు పరిష్కారం అయినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమము లో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రంగస్వామి, ప్రధాన కార్యదర్శి మహేశ్, న్యాయవాదులు ఎల్లారెడ్డి, సురేష్ కుమార్,మైరాముడు, నాగ లక్ష్మయ్య, శ్రీనివాస్ రెడ్డి, సత్యనారాయణ, మల్లికార్జున, నాగభూషణం రెడ్డి, నరసింహయ్య, దామోదర ఆచారి పాల్గొన్నారు.