మహనీయుల త్యాగాలు …మనకు ఆదర్శం
1 min readజిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు… పరిగెల మురళీకృష్ణ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాష్ట్ర ఐక్యత కోసం త్యాగం ఒకరు, దేశ ఐక్యత కోసం మరొకరు కృషి చేసిన మహనీయుల త్యాగాలే మనకు ఆదర్శమని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే, టిటిడి బోర్డు మాజీ సభ్యులు పరిగెల మురళీకృష్ణ వారి సేవలను కొనియాడారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 72 వ వర్ధంతి మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్74 వ వర్ధంతి కార్యక్రమాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మురళీకృష్ణ గారు మాట్లాడుతూ శ్రీ పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించి అమరజీవి యైన మహాపురుషుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారని వారి సేవలను కొనియాడారు. భారతదేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్ర్య సమరయోధుడిగా నెహ్రూ మంత్రివర్గంలో హోం శాఖా మంత్రిగా ఉప ప్రధానిగా పదవులు నిర్వహించారని స్వాతంత్ర్యా నంతరం భారతదేశంలో విలీనం కావడానికి నిరాకరించిన హైదరాబాదు, జునాగఢ్ లాంటి సంస్థానాధీశులను సైనిక చర్యతో మట్టికరిపించి దేశంలో విలీనం చేసిన ఘనత వల్లభాయ్ పటేల్‌కి దక్కుతుందని కనుక ఇలాంటి మహనీయులను ప్రతి కార్యకర్త ఆదర్శంగా తీసుకోవాలని ప్రసంగించారు. ముందుగా పార్టీ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యన్ సి బజారన్న, కె సత్యనారాయణ గుప్త, షేక్ ఖాజా హుస్సేన్, ఎస్ ప్రమీల, మహేంద్ర నాయుడు, వి సాంబశివుడు, ఈ లాజరస్, యజస్ అహ్మద్, ఎస్ఎం ఖాద్రీ పాషా, డబ్ల్యూ సత్యరాజు, బి సుబ్రహ్మణ్యం, వశీ భాష, ఐ ఎన్ టి యు సి ప్రధాన కార్యదర్శి ఎన్ సుంకన్న, ఆర్ ప్రతాప్, ఆశీర్వాదం, కాంగ్రెస్ రమేష్, అక్బర్, రవి, రంగస్వామి, బుజ్జి, మహిళా కాంగ్రెస్ మల్లేశ్వరి, శ్రీలత, సుజాత మొదలగువారు పాల్గొన్నారు.