ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు
1 min readజిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు అని, వారి త్యాగం మరువలేనిది అని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు.ఆదివారం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్ లోని మిని కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలుగు ప్రజలకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు ను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు..నేటి యువత పొట్టి శ్రీరాములు అడుగుజాడల్లో నడిచి రాష్ట్రానికి, దేశానికి తమ వంతు సేవ చేయాలని పిలుపునిచ్చారు.. పొట్టి శ్రీరాములు గాంధీజీ స్ఫూర్తితో సబర్మతి ఆశ్రమంలో చేరి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారన్నారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించిన దేశ భక్తుడన్నారు.. ఆంధ్రరాష్ట్ర సాధన కొరకు మద్రాసులో 1952 అక్టోబర్ 19న నిరాహారదీక్ష ప్రారంభించారని, ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర సాధనలో 1952 డిసెంబర్ 15న అసువులు బాసారని తెలిపారు. ఆంధ్రుల కోసం ఆయన చేసిన త్యాగం చిరస్మరణీయం అని కలెక్టర్ పేర్కొన్నారు.కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చిరంజీవి, బిసి సంక్షేమ అధికారిణి వెంకట లక్ష్మమ్మ, జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ దీప్తి, కలెక్టర్ కార్యాలయం ఏవో విజయశ్రీ తదితరులు పాల్గొన్నారు.