రైతుల సేవల్లో కూటమి ప్రభుత్వం
1 min readపల్లెవెలుగు వెబ్ ఆదోని: రైతులకు అవసరమైన సేవలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పి వి పార్థసారథి అన్నారు. సోమవారం స్థానిక ఎంఎల్ఏ క్యాంపు కార్యాలయంలో నీటి వినియోగదారుల సంఘం ఎన్నికలలో మండల పరిధిలోని పలు గ్రామాల నుండి నియామకమైన చైర్మన్, వైస్ చైర్మన్ లను సన్మానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నీటి వినియోగదారుల సంఘం తరఫున ఎన్నికైన అభ్యర్థులు రైతులకు సకాలంలో సాగునీటి అందించేందుకు కృషి చేయాలి అన్నారు. రైతు సంక్షేమానికి కుటుంబం పెద్దపీఠం వేస్తూ ముందుకు కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కురుబ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప, బిజెపి జిల్లా అధ్యక్షుడు కునిగిరి నీలకంఠ, తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత ఉమాపతి నాయుడు, జనసేన పార్టీ అసెంబ్లీ ఇన్చార్జ్ మల్లప్ప, టిడిపి సీనియర్ నాయకురాలు గుడిసె కృష్ణ, బిజెపి అసెంబ్లీ కో కన్వీనర్ నాగరాజుగౌడ్, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేంద్ర కుమార్, నీటి సంఘాల చైర్మన్ లు, సభ్యులు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.