PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతోనే సంపూర్ణ ఆరోగ్యం 

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు:  ఆత్మకూరు మండలం లోని మండల తహశిల్దర్ కార్యాలయం నందు  ప్రకృతి వ్యవసాయ విధానం లో పాడించిన ఆకుకూరలు, మరియు కూరగాయలు ను ప్రతి సోమవారం రోజు జరిగే  ప్రజా పిర్యాదులు పరిష్కారాల వేదిక కార్యక్రమం లోని ఎంఆర్ఓ రత్న రాధిక  , ఎంఏఓ  విష్ణు వర్ధన్ రెడ్డి ద్వారా అమ్మక కేంద్రం ద్వారా రైతులకు ఆరోగ్యకరమైన కూరగాయలు ఆకుకూరలు అందించడం జరిగింది. మండల వ్యవసాయ అధికారి విష్ణు వర్ధన్ రెడ్డి  ఈ అవకాశం నీ  ప్రజలు మరియు అధికారులు వినియోగించి కోని ప్రకృతి వ్యవసాయ ద్వారా పండిచిన పంటలను తినడం వల్ల  ఆరోగ్యకరమైన ఆహారం మరియు , మనకి కావాల్సిన రోగ నిరోధక శక్తి లభిస్తుంది అని  చెప్పడం జరిగింది, ఎంఆర్ఓ రత్న రాధిక  మాట్లాడుతూ ప్రతి మహిళ ఇంటి పరిసర ప్రాంతం లో  పెరటి తోటలు , మరియు  మిద్దె తోటలు పెంచుకోవడం వల్ల వారి ఇంటికి కావాల్సిన ఆహార ఉత్పత్తుల ను పండించుకోవచ్చు మిగిలిన ఉత్పత్తులు ను బయట మార్కెట్ లో అమ్ముకోవడం వల్ల అధిక ఆదాయం పొందవచ్చు అని  వివరించారు. చిరు ధాన్యాలు తినడం వల్ల మంచి ఆరోగ్యం పొందుతారు అని  వివరించారు.  రైతు సాధికార సంస్థ ప్రకృతి నుండి స్టేట్ రిసోర్స్ పర్సన్ నరేంద్ర గౌడ్  మాట్లాడుతూ మండలంలో నీ ఎంపిక చేసిన కొన్ని ప్రకృతి వ్యవసాయ గ్రామాలలో ప్రకృతి వ్యవసాయ పద్దతిలో పంటలు అందించటం జరుగుతుంది అని ఆ పంటలు పండించటం లో ఎటువంటి రసాయనాలు వాడకుండా పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్దతిలో పంటలు పండించడం జరుగుతున్నది అని ఎలా పండించిన పంటలను ప్రతి సోమవారం ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నాము అని చెప్పడం జరిగింది. డి ఏం ఏం టి సయ్యద్ బాషా మాట్లాడుతూ వివిధ గ్రామాల్లో చేస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతుల గురించి, సాగు చేస్తున్న వివిధ మోడల్స్ గురించి ప్రజలకు, అధికారులకు తెలుపడం జరిగింది.వివిధ రకాల ఉత్పత్తులు ఐన ఆహార ఉత్పత్తులు మరియు అటవీ ఉత్పత్తులు నన్నారి, నన్నారి జ్యూస్, తేనె, అటవీ ఆయుర్వేద ఉత్పత్తులు, చింత పండు, చిరుధాన్యాలు మొదలైనవి మండల కేంద్రలలో అందుబాటు లో ఉంచుతాం అని చెప్పడం జరిగింది  . ఈ కార్యక్రమంలో   ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఎస్ ఆర్ పి నరేంద్ర గౌడ్, డి ఏం ఏం టి సయ్యద్ బాషా ,యూనిట్ ఇన్చార్జి రమేష్ నాయక్, ఐ సి ఆర్ పి జాబీబుల్లా హాజరు కావడం జరిగింది.

About Author