PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సమాచార హక్కు కార్యకర్తల సంఘం క్యాలెండర్ ల ఆవిష్కరణ

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : సమాచార హక్కు చట్టం క్యాలెండర్ ను సమాచార హక్కు కార్యకర్తల సంఘం ఆధ్వర్యంలో నేడు  ఆవిష్కరించారు. హోళగుంద‌ మండలంలోని పోలీస్ స్టేషన్, తహశీల్దార్, ఎంపీడీఓ, కార్యాలయాల్లో ఈ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  కమిటీ సభ్యులు వడ్డే విశ్వనాథ్ రాజ్ , వెంకట గిరి  మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం 2005 పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా చూడవలసిన బాధ్యత ప్రతి భారతీయ పౌరుడిపై ఉందన్నారు. సమాచార హక్కు చట్టం 2005 ద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే పనితీరు, కార్యక్రమాలను తెలుసుకోవచ్చు అన్నారు. వ్యక్తిగత సమాచారం మినహా, ప్రభుత్వ అధికారుల పనితీరును ప్రశ్నించే హక్కు కేవలం సమాచార హక్కు చట్టం 2005 ద్వారా ప్రతి భారతీయ పౌరుడికి ఉంటుందన్నారు. సమాచార హక్కు చట్టం క్యాలెండర్ ను అన్ని రూపాలుగా ప్రజలకు అవగాహన కలిగించే  సమాచార హక్కు చట్టం సభ్యులను ఆయా శాఖల  అధికారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై బాల నరసింహులు, తాసిల్దార్ సతీష్ కుమార్, ఎంపీడీవో విజయాలలిత, పాత్రికేయులు నాగప్ప,రవికుమార్, మహబూబ్ బాషా, మహేష్ గౌడ్ ,ముద్దుసార్,నాగరాజు, పెద్దహ్యట మల్లయ్య, మల్లి , వేణు, కృష్ణ, గాది, పంపా, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *