పోలవరం ప్రాంతంలోని సమస్యలు పరిష్కరించండి
1 min readసీఎం నారా చంద్రబాబు నాయుడికి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విజ్ఞప్తి
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: పోలవరం నియోజకవర్గంలో నెలకున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. సోమవారం పోలవరం సందర్శనకు విచ్చేసిన సీఎం చంద్రబాబుకు పలు సమస్యలతో కూడిన వినతి పత్రాలు అందజేశారు.
వేలేరుపాడులో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుకు ఎంపీ వినతి:
పోలవరం ఏజెన్సీ ప్రాంతంలోని వేలేరుపాడులో మరో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరుకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కోరారు. బుట్టాయగూడెంలో ఉన్న ఎమ్మార్ఎస్ లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇప్పటికే 100 శాతం సీట్లు భర్తీ అయినట్లు ఐటీడీఏ పిఓ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారని, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న విపరీతమైన డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని పోలవరం ఏజెన్సీ ప్రాంతంలో గల వేలేరుపాడులో మరో EMRS ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి ప్రతిపాదనలు పంపించాలని ఎంపీ విన్నవించారు. ప్రత్యామ్నాయ కాలనీ ఏర్పాటు చేయండి:
తరచూ వరద ముంపునకు గురై ఇబ్బందులు పడుతున్న వేలేరుపాడు మండలం కమ్మరిగూడెంలోని 220 కుటుంబాలను ఆదుకోవాలని సీఎం చంద్రబాబుకు ఎంపీ విజ్ఞప్తి చేశారు. 2024 జులైలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు, 2018 నాటి వర్షాల సందర్భంగా పోటెత్తిన వరదలతో కమ్మవారిగూడెం ముంపునకు గురైందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. తరచూ వరదలు వల్ల ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ గ్రామానికి సమీపంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఎత్తైన స్థలంలో పట్టాలు ఇచ్చి ప్రత్యామ్నాయ కాలనీని నిర్మించి ఇవ్వాలని ఎంపీ విన్నవించారు.పెద్దవాగు సమస్య పరిష్కరించండి:
పోలవరం బాధితులను ఆదుకోండి:
పోలవరం మండలం టేకూరు R & R సమస్యలు, గృహాల నిర్మాణం,పునరావాస గ్రామాలకు బస్సులు, ఆసుపత్రి సౌకర్యాలు, దేవరగొందిలో (ప్రగడపల్లి) ll ప్యాకేజీలో విడుదల చేయాల్సిన మిగిలిన సొమ్ము, ఇళ్ల స్థలాలు, భూమి లేని పేదలకు సంబంధించి ఇచ్చిన హామీలను అమలు చేయాలని, 2015లో 1787 కుటుంబాలకు అధికారులు ఇచ్చిన హామీల అమలు కోసం 2016లో పోలవరం ప్రాజెక్ట్ కోసం ఖాళీ చేయబడిన 7 (ఏడు) గ్రామాల ప్రజలకు న్యాయం చేయాలని, పోలవరం పంచాయతీలోని పునరావాస గ్రామంలో 190 ఇళ్లు నిర్మించారని, మంజూరైన జాబితాలో 17 మంది పేర్లను చేర్చాలని ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.