చట్టాల పట్ల అవగాహన కలిగి – సమాజం పట్ల బాధ్యతాయుతంగా మెలగాలి
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : కొత్త చట్టాలను తెలుసుకుంటూ, సమాజం పట్ల బాధ్యతాయుతంగా మెలుగుతూ నిరాశ్రయులైన పేదవారికి అండగా ఉంటూ వారికి తగినటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు నిర్వహించాలని జాతీయ లోక్ అదాలత్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అఫెన్సెస్ కోర్టు మెజిస్ట్రేట్ హేమా స్రవంతి జానకిరామ్ అన్నారు. సోమవారం ఇసుక అక్రమ రవాణా ముద్దాయిలకు ఒకరోజు శిక్ష లో భాగంగా వారికి కేటాయించిన ఫౌండేషన్లలో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆమె ఆదేశాలు చేయడం జరిగిందని సోమవారం సీఐ పురుషోత్తం రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఇసుక అక్రమ రవాణా కేసులోని ముద్దాయిలైన
1)పెనుబాల గంగయ్య, 2)దాలాయి సుబ్బరాయుడు ,3)సింగంరెడ్డి ఓబుల్ రెడ్డి
అను ముద్దాయిలకి ఆర్తి ఫౌండేషన్, మునిసిపల్ గ్రౌండ్, కడప. నందు అలాగే
1)కల్కి సుబ్రహ్మణ్యం రెడ్డి ,2)బెల్లం వెంకట సుబ్బయ్య ,3)గుమ్మల వెంకట సుబ్బారెడ్డి
అను ముద్దాయిలకి బృంద స్పూర్తి ఫౌండేషన్, ఆజాద్ నగర్, నందు అదేవిధంగా C.K దిన్నె మండలమునకు సంబంధించి 1)కుప్పిరెడ్డి వెంకట రమణ, 2) తక్కోలి వెంకట మహేశ్వర రెడ్డి, అను ముద్దాయిలకి పట్టణ నిరాశ్రయుల వసతి గృహం నందు జాతీయ లోక్ అదాలత్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫన్సెన్స్ హేమా స్రవంతి జానకిరామ్ లు వారికి సేవ చేసే విధంగా ఆదేశించినట్లు ఆయన తెలిపారు. కొత్త చట్టాల అమలులో భాగంగా ఒకరోజు కమ్యూనిటీ సర్వీస్ చేయవలసిందిగా వారికి శిక్షగా విధించి, వారికి కేటాయించిన ఫౌండేషన్ల నందు ఉదయం నుంచి సాయంత్రం వరకు సేవా కార్యక్రమాలను చేస్తూ వారికి సహాయంగా ఉండాలని ముద్దాయిలకు తెలియజేసినట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా ముద్దాయిలు అందరూ కూడా వారికి కేటాయించిన ఫౌండేషన్లలో అక్కడి పేదవారికి, నిరాశ్రయులకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. దీనివలన ప్రజలకి కొత్త చట్టాల మీద అవగాహన కలిగి సమాజం పట్ల బాధ్యత తెలుస్తుందని అప్పుడు వారు ప్రజలకు మరింత చేరువై నిరాశ్రయులైన వారికి తమ వంతు సహాయపడే తత్వం ఏర్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.