బాల కార్మికులు -వెట్టి చాకిరీ నిర్మూలనకై ఆకస్మిక తనిఖీలు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: 16-12-2024 నుండి 20-12-2024 వరకు ఆపరేషన్ స్వేచ్ఛ 2024-ఫేస్- 4 లో భాగంగా కర్నూలు నందు బాల కార్మికులు – వెట్టి చాకిరీ నిర్ములన కై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి, ఏ.సి.యల్. సాంబ శివ, ఏ. సి. యల్. హేమాద్రి వివిధ శాఖల అధికారుల ఆద్వర్యంలో, బాల కార్మికులను గుర్తించడానికి తనిఖీ లు నిర్వహిస్తామని తెలిపారు .ఈ రోజు సంబంధిత శాఖ అధికారులు,ఏ . సి. యల్. సాంబా శివ,డి.సి.పి.ఓ.శారద మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమం, కర్నూలు, మహిళా పోలీస్ ఎస్. ఐ. రమణ, పోలీసు, విద్యా శాఖ మొదలైన అధికారుల సహకారంతో కర్నూలు పట్టణంలో రెండు బృందాలుగా వెళ్ళి కొత్త బస్టాండ్, పాతబస్టాండ్, వి.ఆర్.కాలనీ, బళ్ళారి చౌరస్తా, ఆటొ నగర్, ఉల్చాల రోడ్, సంతోష్ నగర్, చిల్డ్రన్స్ పార్క్, ఓల్డ్ కంట్రోల్ రూమ్,బుధవారపేట , 4వ టౌన్ ఏరియాలలో తనిఖీలు నిర్వహించారు. బుధవారపేట లో ఒక బాల కార్మికున్ని గుర్తించడం జరిగిందన్నారు.కార్మిక శాఖ అధికారులు పిల్లవాడికి మరియు వారి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ నిర్వహించారు, వారి కుటుంబ సభ్యులను గుర్తించి వారి కుటుంబ సభ్యులతో కలపడంజరిగిందన్నారు . ఈ కార్యక్రమంలో సంబందిత శాఖ వారందరూ పాల్గొనారు.