డిసెంబరు 6న ప్రార్థన స్థలాల చట్టం అమలు చేయాలి
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: డిసెంబరు 6న ప్రార్థన స్థలాల చట్టం అమలు చేయాలని ఎస్ డి పి ఐ సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆలూరు అసెంబ్లీ అధ్యక్షుడు ఎఫ్ అబ్దుల్ హమీద్, ప్రధాన కార్యదర్శి ఎన్ సుభాస్, ఉపాధ్యక్షులు అబ్దుల్ రహిమాన్, సలాం, హఫీజ్, అల్లాబకాష్ అన్నారు. సోమవారం సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ జాతీయ నాయకులు, రాష్ట్ర అధిష్టానం ఆదేశాల మేరకు హొళగుందలోని ఎస్ డిపిఐ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిసెంబరు 6న ప్రార్ధన స్థలాల చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా విజయవంతంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించిందన్నారు. ఈ ప్రయత్నాల ఫలితంగా మతస్థలాల వివాదాలపై పిటిషన్లను భారత సుప్రీం కోర్టు నిలిపివేసిందన్నారు. ప్రార్ధన స్థలాల చట్టాన్ని అమలు చేయడానికి ఇది ఆమోదయోగ్యమైన సంకేతంగా భావించబడుతుందన్నారు. డిసెంబరు 6న మాతో కలిసిన అన్ని పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు, ప్రజలకు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తుందన్నారు. మనం సమానత్వం మరియు సామరస్యానికి పోరాటం చేస్తూనే ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు హరున్, చికెన్ బక్షి ,ఎం, రహమతుల్లా, ఎస్ఎండి షఫీ, కె, సలాం తదితరులు పాల్గొన్నారు.