5 వ వార్డ్ లో స్పీడ్ బ్రేకర్ మరమ్మతు చేయాలి ..ఎస్డీపిఐ
1 min readసోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా డిమాండ్,
పల్లెవెలుగు వెబ్ హొళగుంద: హొళ గుంద మండలం ఎస్డీపిఐ ఆలూరు అసెంబ్లీ ఆదేశాల మేరకు హాళగుంద గ్రామంలో ఐదో వార్డు నందు పెద్ద మసీదు వెనకాల స్పీడ్ బ్రేకర్ చాలా ఎత్తగా ఉండటం వలన వాహనాలు రాక పోకలకు చాలా ఇబ్బంది కరంగా మారింది అంతే కాకుండా నిత్యవసర సరుకులు పంపిణి చేస్తున్ననటువంటి ప్రభుత్వ వాహనము ఆ స్పీడ్ బ్రేకర్ దాటి వెళ్లడం లేదు అంతే కాకుండా కార్లు తిరిగేటకు చాలా ఇబ్బందికరంగా ఉంది . అంతేకాకుండా పలుసార్లు వాహనాలు స్పీడ్ బ్రేకర్ నందు ఇరుక్కుపోవడం కూడా జరిగింది అందువలన అక్కడి వీధి ప్రజలు స్పీడ్ బ్రేకర్ దగ్గరే వాహనాలు నిలబెట్టి పోవడం జరుగుతుంది అందువలన అక్కడున్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అందుకారణంగా తక్షణమే బ్రేకర్‌కు ఇరువైపులా కాంక్రీట్ వేసి వాహనాలు తిరుగుటకు అనుకూలంగా చేసి ఈ సమస్యను పరిష్కరించాలని ఎస్డీపిఐ 5 వార్ట్ బ్రాంచ్ అధ్యక్షులు వాజిద్ కార్యదర్శి మైఫుస్ అబ్రార్ కైఫ్ ఆరిఫ్ ఇస్మాయిల్ గ్రామ పంచాయతీ సెక్రెటరీ రాజశేఖర్ సార్ సర్పంచ్ చాలవది రంగమ్మ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కైఫ్, వాజిద్, తదితరులు పాల్గొన్నారు.