ఎస్టీ అసోసియేషన్ ఆఫ్ ఆల్ఇండియా సంఘం 2025 డైరీల ఆవిష్కరణ
1 min readపెద్ద ఎత్తున పాల్గొన్న పలు జిల్లాల అధ్యక్ష ,కార్యదర్శులు, సంఘ సభ్యులు
కనుల పండుగగా విజయవంతమైన కార్యక్రమం
పల్లెవెలుగు వెబ్ ఏలూరు: ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆఫ్ ఆల్ఇండియా 2025 డైరీలను, భారత రాజ్యాంగ ద్విభాషా సంకలన పుస్తకాలనుఏలూరు గిరిజన భవన్ లో ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటాపద్మశ్రీ ప్రసాద్, రీజనల్ ఆర్టీసీ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి)మాట్లాడుతూ ఎస్టీల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ సారధ్యంలో తమ వంతుగా కృషి చేస్తానని సంఘానికి హామీ ఇస్తూ. స్థలం కేటాయించి , భవన నిర్మాణానికి చేయూతనిచ్చి అందిస్తానని హామీ ఇచ్చారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో రాణించాలని తాను ఈనాడు ఇలా ఉండటానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసిన కృషి ఫలితంగా ఎస్టీల్లో ఉన్న మహిళలు,బాలికలు వృద్ధిలోకి రావడానికి తమ వంతు సహకారం అందిస్తానని తెలిపారు. అదే విధంగా ఆర్టీసీ విజయవాడ రీజనల్ చైర్పర్సన్రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ బీసీ , ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు ఒక తాటి మీదకి రావాలని పిలుపునిచ్చారు.ఎస్టీ పేద మహిళలకు నూతన వస్త్రాలను, ఎస్టీ విద్యార్థిని విద్యార్థులకు విద్యాపర ఉపకరణాలను ప్రజాప్రతినిధులు అందించారు. సంఘంలోని వివిధ స్థాయిల నాయకులందరూ కలిసి ప్రజా ప్రతినిధులను ఘనంగా సన్మానించారు. వారికి ప్రశంసా పత్రాలను కూడా అందజేశారు. సభకు విచ్చేసిన వారిలో ఆ రోజు ఎవరెవరి పుట్టినరోజులో , పెళ్లి రోజులో తెలుసుకుని వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిచే కేక్ కట్ చేయించారు. లక్కీ డిప్ ద్వారా పదిమందికి బహుమతులను అందించారు. సంఘం నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ దేవరకొండ వెంకటేశ్వర్లు , ప్రధాన కార్యదర్శి చేవూరి పద్మజ, రాష్ట్ర అధ్యక్షులు గంటిమళ్ళ సత్తిబాబు, ప్రధాన కార్యదర్శి దేవరకొండ సాంబశివరావు, కోశాధికారి సింగం బేబీ రాణి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ దేవరకొండ లలిత, జిల్లా అధ్యక్షులు దేవరకొండ సుశీల, ప్రధాన కార్యదర్శి రమేష్ నాయక్ , వసంత కుమార్, కూతాడ రమేష్ ,చానాపతి అచ్చేశ్వరరావు, దోనే రవి, వివిధ జిల్లాల అధ్యక్షులు , ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గాలు, మండలాల నాయకులు వందల సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్య నాయకులు మాట్లాడుతూ ఎస్టీల్లోని 35 తెగల సమగ్ర సంక్షేమం , అభివృద్ధి మా బాధ్యత అని ఉద్ఘాటించారు.సభా కార్యక్రమాలు ఉదయం 8:30 కి అల్పాహారంతో ప్రారంభమైన కార్యక్రమం మధ్యాహ్నం భోజన కార్యక్రమం అనంతరం సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగాయి.