PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ్రేట్ ఫుల్ గిఫ్ట్ సొసైటీ ఆధ్వర్యంలో నిరస్రాయులకు అల్పాహారం,దుప్పట్లు పంపిణీ

1 min read

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: గ్రేట్ ఫుల్ గిఫ్ట్ సొసైటీ డొనేషన్స్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది నిరస్రాయులకు అల్పాహారం, దుప్పట్లను పంపిణీ కార్యక్రమo జరిగింది. ఈ కార్యక్రమానికి సంఘ సభ్యులు ఏర్పాటు చేసిన అల్పాహార పదార్థాలను స్వయంగా వారికి వడ్డించి సంతృప్తితో ఆనందo వ్యక్తం చేశారు. అనునిత్యం బిక్షటన చేసే ఈ శీతాకాల సమయంలో చలికి ఎంతో ఇబ్బంది పడుతున్న వయో వృద్ధులు మహిళలకు అల్పాహారం, దుప్పట్లను గ్రేట్ ఫుల్ గిఫ్ట్ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు సంఘ మధు, యర్రా జయదాస్ మరియు సంఘ సభ్యులు మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా రుణపడి ఉంటామని. అలాగే ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా వారు చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి కుటుంబాలకు ఆ దేవుడు  ఆయురారోగ్యాలతో  అందించాలని ఆకాంక్షించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *