ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి..
1 min readఒకే సర్వే నంబర్ 151 పై నలుగురు వ్యక్తులు ఫిర్యాదు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: మండల పరిధిలోని సుంకేశ్వరి గ్రామంలో కొంత మంది ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారని వారి పై చర్యలు తీసుకుని ఆ భూములకు ఇచ్చిన పాస్ పుస్తకాలను రద్దు చేసి ప్రభుత్వ భూములను కాపాడాలని దబ్బల రామాంజనేయులు అనే వ్యక్తి డిప్యూటీ తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. బుధవారం మండల పరిధిలోని సుంకేశ్వరి గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో డిప్యూటీ తహసీల్దార్ గురురాజరావు కు రామాంజనేయులు వినతిపత్రం అందజేశారు. ఈ వినతి పత్రం లో ని విషయాల ను విలేకరుల కు తెలిపారు. గ్రామంలో సర్వే నెంబరు 151 – 1ఏ లో 1,8 ఎకరాలు, 151 – 1బి లో 1.86 ఎకరాలు, 151 – 1సి లో 1.8 ఎకరాల భూమిని కొంతమంది ఆక్రమించుకున్నారని వీరి కి ప్రభుత్వ బంజరు భూమి ని కొంత మంది రెవెన్యూ అధికారులు అనుభవ దారులుగా చేర్చి పాసు పుస్తకాలు ఇవ్వడం జరిగింది. ఆ పాస్ పుస్తకాలు రద్దు చేయాలని కోరారు. దీనిపై ఆదోని సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. అలాగే ప్రభుత్వ భూములను భూములను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుని ఆ భూములను స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి ఇవ్వాలని కోరారు. అయితే ఇప్పటి వరకు అక్రమార్కులపై కాని రెవెన్యూ అధికారుల పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఇలా అయితే సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని తెలిపారు. ఇదే సర్వే నెంబరు పై అదే గ్రామానికి చెందిన రామక్క, హనుమంతు, నరసింహులు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముకరన్న, వీఆర్వోలు నరసప్ప, ఆనంద్, సర్వేయర్ తిమ్మేష్ గ్రామ ప్రజలు, పెద్దలు కురువ రామలింప్ప, రోగప్ప, లక్ష్మన్న, బీరప్ప, ఉన్నారు.