మాట కటువు మనసు మాత్రం సున్నితం అంటున్న లంక గ్రామాల ప్రజలు
1 min readప్రాణదాత చింతమనేనికి కృతజ్ఞతలు తెలిపిన బాలుడి కుటుంబం సభ్యులు
పెట్రోల్ దాడిలో గాయపడిన బాలుడు
5నెలలు పాటు అన్ని విధాలా అండగా నిలిచి మెరుగైన వైద్య సదుపాయం
ప్రాణాలు కాపాడిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: తమ కుమారుడికి ప్రాణదాతగా నిలిచిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కి బాలుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఏలూరులోని సెయింట్ జేవియర్ హాస్టల్ లో ఈ ఏడాది జులై నెలలో సహచర విద్యార్థి చేసిన పెట్రోల్ దాడిలో ఏలూరు రూరల్ మండలం గుడివాక లంక గ్రామానికి చెందిన ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. అయితే హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల బాలుడు గాయపడిన ఘటనలో విషయం తెలుసుకున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బాలుడిని మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ తరలించి ప్రాణహాని లేకుండా చూడాలని, బాలుడికి ఎలాగైనా అత్యుత్తమ చికిత్స అందించి కోలుకునేలా చేయాలని ఆసుపత్రి వర్గాలకు సూచించి, బాలుడి చికిత్సకు అన్ని విధాల అండగా నిలిచారు. అదే విధంగా ఎప్పటికప్పుడు బాలుడికి అందుతున్న చికిత్స వివరాలను, బాలుడి ఆరోగ్య స్థితిలో పురోగతిని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వయంగా తెలుసుకుంటూ ఉండేవారు. ఈ నేపథ్యంలో దాదాపు 5నెలల చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన బాలుడు, ఇంటికి వెళ్లటం కన్నా ముందుగా తనకు ప్రాణ దాత గా నిలిచిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని చూడాలని కోరగా, బాలుడి కుటుంబ సభ్యులు దుగ్గిరాల లోని క్యాంపు కార్యాలయంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని బాలుడితో సహా కలిసి తమ బిడ్డ కు అన్ని విధాల అండగా నిలిచిన ఎమ్మెల్యే చింతమనేని కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ బాలుడికి అన్ని విధాలా అండగా ఉంటామని, ఇతరత్రా చికిత్స అవసరాలు ఉన్న అదేవిధంగా మెరుగైన విద్యా సౌకర్యాన్ని అందించే విధంగా కూడా చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు.అయితే పెట్రోల్ దాడిలో గాయపడిన బాలుడిని ఐదు నెలల పాటు మెరుగైన చికిత్స అందిస్తూ కంటికి రెప్పలా సంరక్షించడంలో ఎంతో ప్రత్యేక శ్రద్ధ చూపించిన తమ దెందులూరు ఎమ్మెల్యే మాట మాత్రమే కటువు అని, మనసు మాత్రం ఎంతో సున్నితమని తెలుపుతూ, ఈ సందర్భంగా ఆయనకి లంక గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏలూరు రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నంబూరి నాగరాజు సహా పలువురు కూటమి నాయకులు గుడివాకులంక గ్రామ ప్రజలు పాల్గొన్నారు.