పోలీసులు మానసికంగా శారీరకంగా దృడంగా ఉండాలి
1 min readఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్
జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లకు వ్యాయామ పరికరాలు అందజాత
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: ఏలూరు జిల్లా ఎస్పీగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి కె ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్. సిబ్బంది యొక్క సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వస్తున్నారు. ఎప్పటికప్పుడు సిబ్బందికి కావలసినటు వంటి సౌకర్యాల కొరకు సిబ్బంది సంక్షేమం విషయాలలో రాజీ పడకుండా సిబ్బందికి పలు అంశాలలో చేయూత అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం లో ఏలూరు జిల్లాలో ఉన్న నాలుగు సబ్ డివిజన్లు ఏలూరు జంగారెడ్డిగూడెం పోలవరం మరియు నూజివీడు సబ్ డివిజన్ లలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు వాలీబాల్ మరియు నెట్ లను సిబ్బందికి అంద చేసినారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నిత్యం ప్రజాక్షేత్రంలో ఉద్యోగ నిర్వహణలో ఉన్నటువంటి సిబ్బంది కి ఉపయోగపడే ఆటలను వారికున్న తక్కువ సమయంలో ఆటలలో వినియోగించుటకొరకు ప్రతి పోలీస్ స్టేషన్లో వాలీబాల్ ఆటలను నిర్వహించుట కొరకు వాలీబాల్ నెట్ మరియు వాలీబాల్ ను అందించడం జరిగింది. సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి అంటే శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటే ప్రజలకు మెరుగైన సేవలు అందించొచ్చునని, ప్రతి ఒక్కరూ ఖాళీ సమయాలలో ఆటలకు సమయాన్ని వినియోగించాలని తద్వారా శారీరకంగా మానసికంగా దృఢత్వాన్ని కలిగి ఉంటారని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా అదనపు ఎస్పి అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు, ఏలూరు డిఎస్పీ డి శ్రావణ్ కుమార్, ఏ ఆర్ ఆర్ ఐ పవన్ కుమార్, భీమడోలు ఇన్స్పెక్టర్ విల్సన్, ద్వారక తిరుమల ఎస్సై టి.సుధీర్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు నాగేశ్వరరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ స్నానం రమేష్ బాబు మరియు పోలీసు అధికారులు పాల్గొన్నారు.