సొంత ఇల్లు లేని పేదలు పక్కా గృహాలకు దరఖాస్తు చేసుకోవాలి
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు సొంత ఇల్లులేని పేద ప్రజలు పక్కా గృహాలకు దరఖాస్తు చేసుకోవాలని మండల హౌసింగ్ ఏఈ మినీల్ కుమార్ తెలిపారు .ఇల్లు లేని నిరుపేదలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం-2 నందు పక్క గృహాలు పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆన్లైన్లో నమోదు చేసుకున్నందుకు అవసరమైన స్థలం రిజిస్ట్రేషన్ పత్రాలు ,లేదా తాసిల్దార్ ద్వారా పొందిన అనుబంధ పత్రాలు ,ఆదాయ ధ్రువీకరణ పత్రం ,కుల ధ్రువీకరణ పత్రం ,భార్యాభర్తల ఆధార్ కార్డు ,రేషన్ కార్డు ,బ్యాంక్ అకౌంట్, ఆధార్ కు లింక్ అయినటువంటి మొబైల్ నెంబరు తదితర పత్రాలతో హౌసింగ్ కార్యాలయం నందు సంప్రదించాలని ఆయన తెలిపారు. కావున సొంత ఇల్లు లేని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.