పన్ను చెల్లింపులో జాప్యం చేయరాదు …నగరపాలక సంస్థ
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: బుధవారం నగరపాలక సంస్థకు పన్నులు, అద్దె చెల్లింపుల విషయంలో జాప్యం చేయరాదని నగరపాలక అదనపు కమిషనర్ ఆర్.జి.వి. క్రిష్ణ మున్సిపల్ దుకాణదారులకు సూచించారు. బుధవారం సి.క్యాంపు రైతు బజార్ వద్దనున్న మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌ను రెవెన్యూ విభాగం అధికారులతో కలిసి అదనపు కమిషనర్ పరిశీలించారు. పన్ను బకాయిలపై ఆరా తీశారు. అలాగే కాంప్లెక్స్‌కు సంబంధించి మురుగు కాలువలు, దుకాణదారుల మరమ్మత్తుకు సంబంధించి పలు సమస్యలను దుకాణదారులు, అదనపు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. సమస్యలను పరిష్కరిస్తామని అదనపు కమిషనర్ హామీనిచ్చారు. అదేవిధంగా శ్రీ ప్రియ నగర్, రామ్ నగర్, అన్నయ్య నగర్ ప్రాంతాల్లో వి.ఎల్.టి. ధరకాస్తు ప్రదేశాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్.ఓ. జునైద్, ఆర్ఐలు భార్గవ్, రాజు, ప్రత్యేక అధికారి రాజు, తదితరులు పాల్గొన్నారు.