PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్ర డిజిపి నుండి ప్రశంసా పత్రాలు అందుకున్న కర్నూలు జిల్లా ఎస్పీ

1 min read

జాతీయ లోక్ అదాలత్ లో 7,913 కేసులను పరిష్కరించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిన కర్నూలు జిల్లా పోలీసులు.

ఇటీవల ముగిసిన జాతీయ లోక్ అదాలత్లో అత్యధిక కేసులను పరిష్కరించుటలో ప్రతిభ కనబర్చిన  కర్నూలు జిల్లా పోలీసులు.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: డిసెంబరు 14న జిల్లాలో ముగిసిన జాతీయ లోక్ అదాలత్ లో రాష్ట్రంలోనే అత్యధిక కేసులను పరిష్కరించిన జిల్లాగా కర్నూలు జిల్లా పోలీసుశాఖ మొదటి స్థానంలో నిలిచిందని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్ బుధవారం తెలిపారు. లోక్ అదాలత్ లో 7,913 కేసులను పరిష్కరించుటలో క్రియాశీలకంగా పని చేసిన జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందుమాధవ్ ఐపియస్  ,  డిసిఆర్బి సిఐ గుణశేఖర్ బాబు, కర్నూలు మూడవ పట్టణ సిఐ శేషయ్య, కోర్టు మానిటరింగ్ హెడ్ కానిస్టేబుల్  మనోహర్, కర్నూలు త్రీ టౌన్  కానిస్టేబుల్  జాన్సన్, కర్నూలు తాలుకా కానిస్టేబుల్ తిక్కస్వాములను రాష్ట్ర డిజిపి శ్రీ సిహెచ్. ద్వారకా తిరుమలరావు  ఈ రోజు డిజిపి కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసా పత్రాలను అందజేశారని జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్  తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ    మాట్లాడుతూ …జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషనలలో  లోక్ అదాలత్ లో  పరిష్కారానికి అర్హత కలిగిన కేసులను ముందుగా గుర్తించి, ఆయా కేసుల్లో ఫిర్యాదిదారులు మరియు కక్షిదారుల మధ్య సమన్వయం సాధించేందుకు క్షేత్ర స్థాయిలో చక్కని ప్రణాళితో పని చేసామన్నారు. న్యాయస్థానాల విలువైన సమయాన్ని ఆదా చేయడంతోపాటు, స్వల్ప వివాదాలు, క్షణికావేశం పై నమోదైన కేసుల్లో ఇరు వర్గాలను డిసెంబరు 14న నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ నందు ప్రవేశ పెట్టడంతో, న్యాయస్థానం ముందు హాజరై, ఇరువర్గాలు రాజీ పడినట్లుగా వెల్లడించడంతో 7,913 కేసులను పరిష్కరించామన్నారు.భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో పోలీసు అధికారులు, సిబ్బంది పని చేయాలని అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్   పిలుపునిచ్చారు.రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ మెగా లోక్ అదాలత్లో 17,138 కేసులు డిస్పోజ్ కాగా, వాటిలో కర్నూలు జిల్లా పోలీసులు 7,913 కేసులను డిస్పోజ్ చేసి, రాష్ట్రంలోనే కర్నూలు జిల్లా మొదటి స్థానంలో నిలిచారని జిల్లా ఎస్పీ శ్రీ బిందుమాధవ్ ఐపియస్  తెలిపారు. ప్రధమ స్థానంలో కర్నూలు జిల్లా, ద్వితీయ స్ధానంలో విజయనగరం జిల్లా ,  తృతియ స్థానంలో కృష్ణా జిల్లాలు నిలిచాయి.ఈ కార్యక్రమంలో సిఐడి అడిషనల్ డిజి డా. రవిశంకర్ అయ్యాన్నార్, లా అండ్ ఆర్డర్ ఐజి శ్రీ సీహెచ్.శ్రీకాంత్, ఈగల్ ఐజి శ్రీ ఆకె రవికృష్ణ, రైల్వే మరియు స్పోర్ట్స్ ఐజిపి కే.వి.మోహనరావు పలువురు ఉన్నతాధికారులు, ఇతర జిల్లాల ఎస్పీలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *