వన్ స్టాప్ సెంటర్ ను సందర్శించిన ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలు
1 min readసెంటర్లో తాత్కాలిక వసతి పొందుతున్న మహిళలు వివరాలు పై ఆరా
రిజిస్టర్, కేసు ఫైల్స్ పరిశీలన
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళ కమిషన్ సభ్యురాలు బూసి వినీత మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడపబడుతున్న వన్ స్టాప్ సెంటర్ ను సందర్శించడం జరిగింది. వన్ స్టాప్ సెంటర్ కు ఏ విధమైన కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయో, అలాగే బాధిత మహిళలకు ఏ విధమైన సేవలు అందిస్తున్నారనే విషయాన్ని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అలాగే వన్ స్టాప్ సెంటర్లో తాత్కాలిక వసతి పొందుతున్న మహిళ వివరాలు అడిగి తెలుసుకొని ఆమెతో మాట్లాడి కౌన్సిలింగ్ నిర్వహించినారు. తదుపరి వన్ స్టాప్ సెంటర్ లో మెయింటైన్ చేస్తున్న రిజిస్టర్స్ ని మరియు కేసు ఫైల్స్ ని పరిశీలించడం జరిగింది. బాధిత మహిళలకు ,బాలికలకు మెరుగైన సేవలు అందించాలని తెలియజేశారు. ఈ సందర్శన భాగంలో వన్ స్టాప్ సెంటర్, సెంటర్ అడ్మినిస్ట్రేటర్ సి.హెచ్. నిర్మల మరియు ఒన్ స్టాప్ సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు.