జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ జట్టు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఈనెల 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ లో జరిగే జాతీయ స్థాయి జూనియర్ బాలికల హ్యాండ్ బాల్ ఛాంపియన్షిప్ లో పాల్గొంటున్నట్లు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి. శ్రీనివాసులు ప్రకటించారు.శుక్రవారం స్థానిక ఆదర్శ విద్యా మందిర్ జూనియర్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ హరికృష్ణ పాల్గొని క్రీడాకారుల కరచాలనంతో అభినందించి మాట్లాడారు. రాష్ట్రానికి మంచి పేరు తీసుకొని రావాలని అలాగే పతకాలతో తిరిగి రావాలని ఆయన కోరారు.ఏపీ జట్టు: సిహెచ్ దేవిక, జి దేవి, ఎస్, పుష్ప ,సిహెచ్ గాయత్రి ,వెంకటలక్ష్మి, ఝాన్సీ ,రిషిత ,జ్యోతి, హన్సిక ,అనన్య ,త్రివిధ, లక్ష్మీ ,శ్రీ వాణి ,షాహిదా కాగా జట్టు కోచ్ గా వెంకటేష్, మేనేజర్ గా పుణ్యవతిలు వ్యవహరిస్తున్నట్లు తెలిపారు.