ఏపీ ఎన్జీవోస్ పునర్నిర్మాణ భవనం ప్రారంభోత్సవం
1 min readపల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఏపీ ఎన్జీవోస్ పునర్నిర్మాణ చేపట్టిన హాల్ ప్రారంభోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏపీ ఎన్జీవో అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్ సంఘ సభ్యుల సమక్షంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాల నుండి విధులు నిర్వహిస్తుంటారని కొన్ని సందర్భాలలో నివాసాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుందని, అటువంటి సమయంలో ఉద్యోగుల ఈ భవనాలలో విశ్రాంతి తీసుకుంటారని అన్నారు. అదేవిధంగా ఉద్యోగుల సంఘ కార్యకలాపాలకు వేదికగా ఉంటుందని, జిల్లాలో నలుమూలల నుండి బదిలీల రీత్యా ఆయా ప్రాంతాలలో పని చేయవలసి వచ్చినప్పుడు ఈ భవనాలు అనుకూలంగా ఉంటాయన్నరు. అనంతరం ఈ భవనంలో సెమి క్రిస్మస్ వేడుకను నిర్వహించి కేక్ కట్ చేసి ఒకరి కొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నేరుసు రామారావు, ఎన్జీవో జేఏసీ నాయకులు ఆర్ ఎస్ హరినాథ్, తణుకు నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు.