ప్రపంచం మెచ్చిన గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్
1 min readహెచ్ఎం భ్రమరాంబ
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: ప్రపంచం మెచ్చిన గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ అని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భ్రమరాంబ కొనియాడారు. శనివారం పత్తికొండ స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ 137 వ జయంతి వేడుకలను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి భ్రమరాంబ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా మొదట శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. పాఠశాలలో విద్యార్థినిలు తమ ప్రతిభను కనబరిచే అనేక గణిత నమూనాలను ప్రదర్శించారు. ఉత్తమ నమూనాలకు మొదటి ,,ద్వితీయ, తృతీయ నమూనాలకు బహుమతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు బ్రమరాంబ మాట్లాడుతూ, మనందరి జీవితాల్లో గణితం ఉంటుంది ,కానీ చాలా అరుదుగా కొందరి జీవితాల్లో ఉంటుంది. విశ్వవిఖ్యాత గణిత మేధావులు మెచ్చిన భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస్ రామానుజన్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గణిత ఉపాధ్యాయులు పద్మావతి, నాగలక్ష్మి, రాజశేఖర్ , పద్మజా, విద్యార్థినీలతోపాటు పలువురు పాల్గొన్నారు.