జూనియర్ సివిల్ కోర్టుకు రెగ్యులర్ జడ్జిని నియమించాలి
1 min readబార్ అసోసియేషన్ అధ్యక్షులు రంగస్వామి
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ జూనియర్ సివిల్ కోర్టుకు రెగ్యులర్ జడ్జిని నియమించాలని పత్తికొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు బి.రంగస్వామి కోరారు. శనివారం కర్నూలు పట్టణంలోని రాష్ట్ర హైకోర్టు జడ్జి డాక్టర్ జస్టిస్ కె. మన్మథరావు, జిల్లా ప్రిన్సిపల్ జడ్జి జి.కబర్ధి లకు పత్తికొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు రంగస్వామితో పాటు పలువురు న్యాయవాదులు పత్తికొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు కు రెగ్యులర్ జడ్జి ని నియమించాలని వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పత్తికొండ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఎంఎస్ భారతి ప్రమోషన్ పై చిత్తూరు జిల్లాకు బదిలీపై వెళ్లారని తెలిపారు. అందువల్ల పది రోజుల నుండి జూనియర్ సివిల్ కోర్టుకు రెగ్యులర్ జడ్జి లేకపోవడంతో న్యాయవాదులు మరియు కక్షిదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కావున పత్తికొండ జూనియర్ సివిల్ కోర్టుకు రెగ్యులర్ జడ్జిని నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు రవికుమార్, సహాయ కార్యదర్శి వాసుదేవ నాయుడు, ఏపీజీ నరసింహయ్య, న్యాయవాదులు బాలభాష, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.