సోషల్ సర్వీస్ సెంటర్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు
1 min readపేదలకు సహాయ సహకారాలు అందించడంలో ఆర్.సి.యం సంస్థలు ముందుంటాయి
ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి
పెద్ద ఎత్తున పాల్గొన్న దైవజనులు,రాజకీయ ప్రముఖులు
పలువురిని అలరించిన సాంస్కృతి కార్యక్రమాలు
పలువురు ప్రముఖులకు సన్మానలు
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: స్థానిక జేవియర్ నగర్ లో ఉన్న సోషల్ సర్వీస్ సెంటర్ నందుఏలూరు డయోసిస్ బిషప్ జయరావు ఆలోచనలతో సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ టి.ఇమ్మానియేల్ సారధ్యంలో శనివారం ఉదయం జరిగిన సెమీ క్రిస్టమస్ ఆనంద హేళ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య పాల్గొన్నారు వారితో పాటు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు హాజరయ్యారు.ఈ సందర్భంగా నిర్వాహకులు ఏర్పాటుచేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు, సేవా కార్యక్రమాల్లో భాగంగానాలుగు జిల్లాల పరిధిలో 128 సంఘాల వారికి సోషల్ సర్వీస్ సెంటర్ వారు ఏర్పాటు చేసిన 25 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈసందర్భంగా శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ ఆర్ సి ఎం సంస్థల వారు దేశంలో ఎంతోమంది పేద ప్రజలకు సహాయపడుతుంటారని, దానిలో భాగంగా ఏలూరు డయాసిస్ నుండి సోషల్ సర్వీస్ సెంటర్ గతంలోఅనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అనేక విపత్తులకు తక్షణం స్పందించి ఆర్థిక సహాయం నిత్యవసర వస్తువులు అందించటం లో ముందుంటారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు,ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, త్రీ టౌన్ సిఐ కోటేశ్వరరావు, సెయింట్ జాన్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు పెరికే వరప్రసాదరావు ని పలుఆర్.సి.ఎం సంస్థలకు చెందిన ఫాదర్ లని బిషప్ జయరావు పొలిమేర ఘనంగా సత్కరించారు.