ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు..
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని ఉప్పలదడియ గ్రామంలో ఆర్.సి.యం చర్చి ప్రాంగణంలో జరిగిన ఐక్య క్రిస్మస్ వేడుకలు విచారణ గురువులు ఫాదర్ మధుబాబు ఆధ్వర్యంలో రాత్రి అంగరంగ వైభవంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జీవసుధ పాస్టరల్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ బాలరాజు మరియు మిడుతూరు టీడీపీ మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి,టీడీపీ నాయకులు కమతం రాజశేఖర్ రెడ్డి తదితర నాయకులు ముందుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏసు క్రీస్తు జన్మదినం గురించి ఫాదర్ బాలరాజు వాక్య పరిచర్య చేశారు.బాలికలు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. క్రిస్మస్ కేకు కట్ చేసి ఒకరినొకరు సంతోషంగా పంచుకోవడం జరిగినది. గురువులను మరియు వివిధ గ్రామాల నుండి వచ్చిన నాయకులను శాలువాలు పూలమాలలతో ఘనంగా సత్కరించారు.చివరగా పశువుల పాక,నావాహు ఓడ, తదితర గ్యాలరీలను ఎంతో అలంకరణగా తీర్చి దిద్దిన వాటిని ఆ గ్యాలరీలోకి వెళ్లి వాటిని తిలకించారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నాయకులు కమతం వీరారెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి,సల్కోటి గోవర్ధన్ రెడ్డి,వెంకటేశ్వర రెడ్డి, నరసింహ గౌడ్,శబ్భు, రమణారెడ్డి,నబి రసూల్, బ్రదర్ థోమాస్ విచారణ పెద్దలు పక్కిరయ్య, ఆనందరావు,ఏసన్న,జాన్, సామన్న,సిద్దయ్య,హరి,డేవిడ్,శేఖర్,ఈరన్న మరియు 10 గ్రామాల విశ్వాసులు పాల్గొన్నారు.