NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నగరంలో ప్రైమ్ గోల్డ్ హాబ్ ప్రారంభం..

1 min read

విజయవాడ , న్యూస్​ నేడు:  స్థానిక  గవర్నర్‌పేటలో ప్రైమ్ గోల్డ్ హబ్ ను రాష్ట్ర  కార్మిక శాఖ  మంత్రి వాసంశెట్టి సుభాష్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన   కార్యక్రమంలో శాసన సభ్యులు బోండా ఉమా మాట్లాడుతూ బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం విడిపించుకోలేని మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం కలిగేలా ఈ సంస్థ కొత్త సేవలను ప్రారంభించడం ఎంతో అభినందనీయమని అన్నారు. తాకట్టు లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు బంగారం మార్కెట్ విలువ ప్రకారం మిగతా సోమ్ము తిరిగి ఇవ్వడం జరుగుతుందన్నారు. దిని ద్వారా ప్రజల ఆర్థిక భారాన్ని తగ్గించడమే సంస్థ లక్ష్యమని వివరించారు.  సెకండ్‌హ్యాండ్ గోల్డ్ ను పారదర్శకంగా విక్రయిస్తారని తెలిపారు . ఈ విధానం ప్రజల ఆర్థిక అవసరాలను తీర్చడమే కాకుండా, విలువైన బంగారం మరల వినియోగంలోకి రావడానికి దోహదపడుతుందన్నారు. ప్రైమ్ గోల్డ్ హబ్ వినియోగదారులకు నమ్మకమైన సేవలు అందించి, పారదర్శకతో మరింత ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం సంస్థ నిర్వాహకులు  శివప్రసాధ్ మాట్లాడుతూ సుమారు  4 రాష్ట్రాలలో 10 బ్రాంచ్లో తో ఇప్పటివరకు తమ కస్టమర్లకు సేవలందించామని  చెప్పారు. తమ సేవలను తమ వినియోగదారులకు  మరింత  చేరువ  చేయాలన్న లక్ష్యముతో  కొత్త బ్రాంచ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు…  పేద మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని    తమ సంస్థ  కొత్తగా  సెకండ్ హ్యాండ్ జువెలరీ అమ్మకాలను సరికొత్తగా ప్రారంభించడం ప్రభుత్వం జరిగిందని తెలిపారు. తమ సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు.. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వ్యాపారవేత్తలుతదితరులు పాల్గొన్నారు.

About Author