భారతదేశ మేధాశక్తిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన గణిత మేధావి శ్రీనివాస రామానుజన్
1 min read– లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫెలో ఆఫ్ ది ట్రినిటీ గుర్తింపు పొందిన తొలి భారతీయుడు శ్రీనివాస రామానుజన్ జన్మదినోత్సవ వేడుకలను లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ఆధ్వర్యంలో స్థానిక కే.ఎన్.ఆర్ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ముందుగా లయన్స్ క్లబ్ సభ్యులు శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలను అలంకరించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ప్రతినిధి మాజీ లయన్స్ జిల్లా అడిషనల్ క్యాబినెట్ సెక్రటరీ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ క్లిష్టమైన గణిత సమస్యలను సైతం తన మేధాశక్తితో పరిష్కరించిన ప్రపంచ ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ గౌరవం పొందిన రెండవ భారతీయుడుగా చరిత్రలో నిలిచిపోయాడు అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ కార్యదర్శి లయన్ టి .గోపీనాథ్ మాట్లాడుతూ విద్యార్థులలో ప్రతిభను వెలికి తీసేందుకు గణిత శాస్త్రంలో క్విజ్ పోటీలను నిర్వహించామన్నారు.క్విజ్ పోటీల్లో విజేతలకు, మ్యాథ్స్ ఫెయిర్ లో ప్రతిభ చూపించిన విజేతలకు సర్టిఫికెట్లు మరియు బహుమతులు అందజేశారు . కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ కార్యవర్గ సభ్యులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.కార్యక్రమంలో రిటైర్డ్ సిల్వర్ జూబ్లీ కళాశాల ప్రిన్సిపల్. డి .నాగరాజు , ఉపాధ్యాయులు జగదీష్, షరీఫ్, డి.వి సుబ్బమ్మ, ఉదయ్ ,మూర్తి ,ఖాదర్ అశ్వక్, శ్రీలక్ష్మి, శారద ,కల్పన విజయలక్ష్మి, కృష్ణవేణి పాల్గొన్నారు.