ఘనంగా మాజీ సీఎం జగన్ జన్మదిన వేడుకలు..
1 min readభారీ కేక్ ను కట్ చేసిన వైసీపీ నేతలు..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి 52 వ జన్మదిన వేడుకలు శనివారం మిడుతూరు, నందికొట్కూరులో ఘనంగా నిర్వహించారు.మిడుతూరు మండల కేంద్రంలో పాత తహసిల్దార్ కార్యాలయం దగ్గర వైసీపీ మండల కన్వీనర్ తువ్వా లోకేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తువ్వా చిన్న మల్లారెడ్డి,బన్నూరు నాగిరెడ్డి మరియు కార్యకర్తల సమక్షంలో కేకును కట్ చేశారు. మాజీ సీఎం జగన్ జన్మదినం సందర్భంగా నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైసీపీ పట్టణ అధ్యక్షులు మన్సూర్ ఆధ్వర్యంలో పండ్లు,బ్రెడ్ పంపిణీ చేశారు.ముందుగా నందికొట్కూరు వైఎస్ఆర్ సర్కిల్ లో దిగవంత నేత డా. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాని కి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరంజగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలు నాయకులు సంబరాలు చేసుకున్నారు. నిండు నూరేళ్లు మా పార్టీ అధ్యక్షులు ఆయు రా రోగ్యాలతో ఉండాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో పార్టీ జడ్పిటిసి పోచా జగదీశ్వరరెడ్డి,మాజీ జడ్పీటీసీ పుల్ల్యాల నాగిరెడ్డి,తువ్వా చిన్న మల్లారెడ్డి,సర్పంచ్ జనార్దన్ గౌడ్,అబూబక్కర్,ప్రచారవిభాగం జిల్లా అధ్యక్షులు కొకిల రమణారెడ్డి,విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు సురేష్ యాదవ్,విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి మాదురి గౌడ్,ఉపేంద్ర రెడ్డి,చింతా విజ్జి,మార్కెట్ రాజు,జబ్బార్,కిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.