నైతిక విలువల పుస్తకాల రూపకల్పన అభినందనీయం.. ఆపస్
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ని కేబినెట్ హోదాలో విద్యార్థులు నైతిక విలువలు సలహాదారు గా నియమించడం, వారి సేవలను వినియోగించుకునేందుకు కేబినెట్ సమావేశంలో చర్చించి విద్యార్థులలో నైతిక విలువలను పెంపొందించేందుకు ప్రత్యేకంగా పుస్తకాలు రూపొందించాలని నిర్ణయించడం హర్షనీయమని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) రాష్ట్ర అధ్యక్షులు ఎస్ బాలాజీ ప్రధాన కార్యదర్శి జి వి సత్యనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులలో నైతిక విలువలు అడుగంటుతున్న తరుణంలో, ప్రస్తుత టెక్నాలజీ యుగంలో కుటుంబ విలువలు కోల్పోతున్న ఈ సందర్భంలో , డ్రగ్స్ కల్చర్, బాలికలపై అఘాయిత్యాలు, అసాంఘిక కార్యక్రమాలు పెరిగిపోతున్న సమాజంలో కేజీ నుంచి పీజీ వరకు ఇంటిగ్రేట్ చేస్తూ విద్యార్థులకు విలువలతో కూడిన పాఠ్యప్రణాలకు రూపొందించాలని కూడా నిర్ణయించడం అభినందనీయమని, ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలను ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం పక్షాన స్వాగతిస్తున్నామని, తెలిపారు. ఇదే స్ఫూర్తితో కేజీ నుంచి పీజీ విద్యార్థులకు వారంలో ఒక గంట పాటు అందరూ వీక్షించేలా ఒక వర్చువల్ కార్యక్రమాన్ని చాగంటి వారితోనిర్వహించాలని వారు కోరారు.