25 లక్షల రూ. ఏలూరు నగరంలో గుంతలు లేని రోడ్డు పనులు
1 min readరాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్డు పనులు పూర్తి
రోడ్డు పనులు పరిశీలించిన ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: 2025 సంక్రాంతి పండుగ లోపు రాష్ట్ర వ్యాప్తంగా గుంతలు లేని రోడ్లు తయారు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుమేరకు. ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య* (చంటి) ఆదేశాలతో నగరపాలకసంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు పాలకవర్గం ఆమోదంతో మున్సిపల్ జనరల్ ఫండ్స్ నుండి సుమారు కోటి. 25 లక్షల రూపాయలతో ఏలూరు నగరంలో గుంతలు పూడిచే పనులు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా స్థానిక ఆర్ఆర్ పేట వెంకటేశ్వరస్వామి గుడి సమీపంలో సుమారు 24 లక్ష రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న బీ.టీ రోడ్డు పనులు నాణ్యతను శనివారం ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు,మున్సిపల్ కమిషనర్ ఏ.భాను ప్రతాప్,పలువురు కార్పొరేటర్లు,కో-ఆప్షన్ సభ్యులు మున్సిపల్ ఎస్.ఇ,ఎం.ఈ,డి.ఈ,ఏ.ఈ పలువురు అధికారులు,తెలుగుదేశం పార్టీ నాయకులు,డివిజన్ ఇన్చార్జిలు పాల్గొని బీటీ రోడ్డు పనులను పరిశీలించారు.