స్కూల్ కాంప్లెక్స్ విధానాన్ని కొనసాగించాలని తహసిల్దార్కి వినతి
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: ఇంగలదహల్ గ్రామం నందు పురాతనమైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ కాంప్లెక్స్ విధానాన్ని కొనసాగించాలని గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున సోమవారం తహసిల్దార్ సతీష్ కు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ సభ్యులు మల్లికార్జున, ఎండి హళ్లి సర్పంచ్ సుధాకర్, పెద్ద గోనెహల్ సర్పంచ్ వెంకటరామిరెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్ చంద్రన్న మాట్లాడుతూ ” 1964 సంవత్సరంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆనాడు పాఠశాల ఏర్పాటు చేసినప్పుడే పాఠశాలకు కాంప్లెక్స్ ను ఇవ్వడం జరిగిందని, కానీ గత కొన్ని రోజుల క్రితం స్కూల్ కాంప్లెక్స్ రీ ఆర్గనైజింగ్ పేరుతో ఉన్న కాంప్లెక్స్ను తొలగించడం జరిగిం దన్నారు. ఇంగలదహల్ పాఠశాల 1964లో ఏర్పాటు చేయడంతోపాటు విశాల మైన 7.65ఎకరాల స్థలం పాఠశాలకు వదిలి పెట్టడం జరిగింద న్నారు. అలాగే రోడ్డు రవాణా సౌకర్యం,బాలుర వసతి గృహం, పాఠశాలలో అదనపు తరగతి గదులు అన్ని వసతులు ఉన్న పాఠశాల కాంప్లెక్స్ ను ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తొలగించడం దారుణం అన్నారు. కావున కాంప్లెక్స్ ను యథావిధిగా కొనసాగించాలని ఎంపీడీఓ, మండల విద్యాధికారికి వినతిపత్రం అందజేయడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు శ్రీకాంత్ రెడ్డి, చంద్రకాంత్ రెడ్డి, వెంకటరామిరెడ్డి యూత్ అసోసియేషన్ సభ్యులు రఫీ,రాజు, శేఖర్, మల్లికార్జున బాబు పంపాపతి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.