జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: క్రిస్మస్ పండుగని పురస్కరించుకుని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి వర్యులు మరియు జిల్లా ఇంఛార్జి మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రివర్యులు టి.జి. భరత్ జిల్లా ప్రజలకు మంగళవారం ఒక ప్రకటనలో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.త్యాగం, ప్రేమ, కరుణ గొప్పతనాన్ని ఏసుక్రీస్తు తన బోధనల ద్వారా విశ్వ మానవాళికి తెలియచేసారని వారు తెలిపారు.. క్రీస్తు అనుసరించిన మార్గం ఎంతో ఆదర్శమన్నారు. ఏసుక్రీస్తు గొప్ప శాంతి దూత అని, శత్రువులను సైతం క్షమించమని చెప్పిన కరుణామూర్తి అని తెలిపారు. ఆయన చూపిన శాంతి మార్గంలో పయనించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంతో వెల్లి విరియాలని మంత్రులు ఆకాంక్షించారు.జిల్లాలోని క్రైస్తవ సోదరసోదరీమణులు అందరూ క్రిస్మస్ వేడుకలను ఘనంగా, సంతోషంగా జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు.