‘హైందవ శంఖారావం ‘ బహిరంగ సభ పై డిజిపి తో ఎమ్మెల్యే చర్చ..
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఈరోజు విజయవాడలో – జనవరి 5 న విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరగబోయే ‘హైందవ శంఖారావం ‘ బహిరంగ సభ ఏర్పాట్ల గురించి డిజిపి శ్రీ ద్వారకా తిరుమల రావు ని కలిసి వివరించాను. రెండు లక్షల మంది రాష్ట్ర నలుమూలల నుంచి ఈ సభకు హాజరవుతున్నట్టు తెలిపాను . పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నందున సమస్యలు రాకుండా ముందుగా తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించాను. పోలీస్ శాఖ వైపు నుంచి పూర్తి సహకారం అందిస్తామని డిజిపి హామీ ఇచ్చారు.