దుప్పట్లను పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే ఐజయ్య..
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: క్రిస్మస్ పండుగ సందర్భంగా వృద్ధులకు చిన్నారులకు దుప్పట్లను పంపిణీ చేసి మానవతా వాదాన్ని చాటుకున్నారు నంద్యాల జిల్లా నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే ఎక్కలదేవి ఐజయ్య..కర్నూలు మండల పరిధిలోని గార్గేయపురం చెరువు దగ్గర ఉన్న అభయగిరి పుణ్యక్షేత్రం నందు పిల్లలకు,వృద్ధులకు స్త్రీలకు 100 మందికి పైగా దుప్పట్లను మాజీ ఎమ్మెల్యే ఐజయ్య పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగ సందర్భంగా మీకు దుప్పట్లను పంపిణీ చేయడం నాకు చాలా సంతోషంగా ఉందని అంతేకాకుండా మీ అందరికీ మంచి ఆయురారోగ్యం దేవుడు కలగజేయాలని ఆయన ఆకాంక్షించారు. చిన్నారులు ముందస్తు క్రిస్మస్ కేకును వృద్ధులు మరియు పిల్లల సమక్షంలో మాజీ ఎమ్మెల్యే మరియు అభయగిరి సుపీరియర్ సిస్టర్ దీప్తి కేకును కట్ చేశారు.మీ లాంటి వారి సహకారంతో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తామని మాలాంటి వారిని మీరు చేర తీసినందుకు ఆ దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని కలుగజేయాలని పిల్లలు వృద్ధులు మహిళలు ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో యువ నాయకుడు ఎక్కలదేవి రాజశేఖర్,చెరుకురత్నం, వేల్పుల శ్రీనివాసులు,పిడతల శేషన్న,దామోదరం జాషువా కర్ణాకర్,రాజు తదితరులు పాల్గొన్నారు.