జోరందుకున్న అభివృద్ధి పనులు…
1 min readమండలంలో రూ 2 కోట్ల తో సిసి రోడ్లు
టిడిపి నాయకులు రఘునాథ్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా నే మంత్రాలయం ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి సహయ సహకారాలతో మంత్రాలయం మండలం లో కూడా అభివృద్ధి పనులు జోరందుకున్నాయని టిడిపి నాయకులు, మాధవరం మాజీ సర్పంచ్ రఘునాథ్ రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని మాధవరం గ్రామంలో గంగమ్మ గుడి దగ్గర శరవేగంగా జరుగుతున్న సిసి రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రాలయ నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ శ్రీ రాఘవేంద్ర రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను కలిసి వెనుక బడిన మంత్రాలయం నియోజకవర్గం అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. దీనికి సంబంధించిన చంద్రబాబు నాయుడు రూ 2 కోట్ల 50 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ నిధులతో మండలం లో అన్ని గ్రామాల్లో సిసి రోడ్లు పనులు జోరుగా సాగుతున్నాయని తెలిపారు. అలాగే నియోజకవర్గం లో కూడా అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయని తెలిపారు. గత ప్రభుత్వం లో నిధులు లేక గ్రామ సర్పంచులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. కూటమి ప్రభుత్వం లో ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. వీరి వెంట లక్కి విజయ్, హుసేని ఆలం, తదితరులు ఉన్నారు.