ప్రభుత్వ కార్యాలయాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
1 min readపల్లెవెలుగు వెబ్ నంద్యాల: జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తనిఖీ చేశారు. మంగళవారం సాయంత్రం నంద్యాల పట్టణం పొన్నాపురం కాలనీలో వున్న డివిజనల్ పంచాయతీ కార్యాలయం, సచివాలయం 2, అంబేద్కర్ భవన్, సాంఘిక సంక్షేమ కార్యాలయం, చంటి పిల్లల ప్రత్యేక దత్తత కేంద్రాలను పరిశీలిస్తూ సిబ్బంది, కార్యకలాపాల పనితీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు కార్యాలయాల్లోని చుట్టుపక్కల ప్రదేశాలు దురాక్రమణలకు గురికాకుండా పరిరక్షించుకోవాలన్నారు. చంటి పిల్లల ప్రత్యేక దత్తత కేంద్రాన్ని చక్కగా, పరిశుభ్రంగా ఉంచుకున్నారని కలెక్టర్ ప్రశంసించారు. చంటి పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు పిల్లలను బాగా చూసుకోవాలని సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు.