PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

27న జరిగే  ర్యాలీని విజయవంతం చేద్దాం.. మాజీ ఎమ్మెల్యే

1 min read

వైఎస్ఆర్సిపి నంద్యాల  జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజి ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి  కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించారు…!!!!

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కరెంటు చార్జీల భారం ప్రజలపై కరెంటు చార్జీల పిడుగు వేసిన కూటమి ప్రభుత్వం పై చంద్రబాబు మోసాన్ని ఎండగడుతూ.. ప్రజలతో కలిసి వైయస్‌ఆర్‌సీపీ డిసెంబరు 27న ర్యాలీగా వెళ్లి విద్యుత్ శాఖ అధికారి SE కి వినతి పత్రం అందజేయడం జరుగుతుంది..కావున ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలి అని కోరారు…అనంతరం మీడియాతో మాట్లాడిన శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి ..!! కరెంటు చార్జీలు పెంచబోనని హామీలిచ్చిన చంద్రబాబఅవసరమైతే చార్జీలు తగ్గిస్తానంటూ బూటకపు హామీలు గుప్పించిన బాబు,  వినియోగదారులే కరెంటు అమ్మేలా చేస్తానంటూ ప్రగల్భాలు, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీని తుంగలో తొక్కిన చంద్రబాబు, ఆరు నెలలు తిర్కకుండానే జనంపై చార్జీల పిడుగు.అబద్ధపు వాగ్దానాలు చేసి ప్రజలతో ఓట్లేయించుకుని ఇప్పుడు బాదుడే బాదుడు, ఎన్నికలకు ముందు పెంచమన్నారు. ఇప్పుడు నడ్డి విరుస్తున్నారు.1.ఎన్నికలకు ముందు చంద్రబాబు.. విద్యుత్ ఛార్జీల విషయంలో ప్రజలకు హామీ ఇచ్చాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, అవసరమైతే గతంలో పెంచినవి కూడా తగ్గిస్తామని చెప్పాడు. ఊరూ, వాడా కాలికి బలపం కట్టుకుని ఇదే చెప్పాడు. పులివెందుల, కడప, టీడీపీ మహానాడులోనూ, ఆగస్టు కార్యకర్తలతో జరిగిన టెలికాన్ఫరెన్స్లోనూ, పెద్దాపురంలోనూ, వైజాగ్ విజన్ డాక్యుమెంట్ విడుదల సమయంలోనూ ఇదే చెప్పాడు.వేర్వేరు చోట్ల విద్యుత్ ఛార్జీలు పెంచబోమంటూ చంద్రబాబు వివిధ సభల్లో ఏమన్నాడో చూడండి.19 మార్చి 2019, కడప కరెంట్ కొరత  2004లో లేదు. 2014లో అది 22.5 మిలియన్ఐయూనిట్లు. నేను గర్వంగా చెప్పగలను. రెండు నెలల్లో కరెంటు కొరత లేకుండా చేశాను. కరెంటు చార్జీలు పెంచేది లేదన్నాం. వ్యవసాయానికి 9 గంటలు విద్యుత్అస్తున్నాం. ఇళ్లకు 24 గంటలూ ఇస్తున్నాం. భవిష్యత్లో ఎంత కావాలంటే అంత కరెంట్అచ్చి రేట్లు పెంచకుండా ముందుకు పోయే ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని మీకు తెలియజేస్తున్నా.27 మే 2020, టీడీపీ మహానాడు కరెంటు చార్జీలు ఎవరూ కట్టే పరిస్థితి లేకపోతే కరెంటు చార్జీలు పెంచబోమని చెప్పాం. ఐదేళ్లు కరెంటు చార్జీలు పెంచలేదు. టెక్నాలజీ ఉపయోగించాం. సోలార్ఎనర్జీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాం. దానివల్ల రానున్న రోజుల్లో రేట్లు తగ్గించే దిశగా మనం ముందుకు వెళితే.. మీరు (జగన్) పవర్రోట్లు పెంచారు. రైతులకు కూడా కరెంటు చార్జీలు పెంచే పరిస్థితికి వస్తున్నారు. ఇది క్షమించరాని నేరం.10 ఆగస్ట్ 2022, కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే విద్యుత్చార్జీలు తగ్గించే వాళ్లం. రాష్ట్రంలో విద్యుత్చార్జీల పెంపును నిరసిస్తూ ప్రభుత్వంపై దశలవారీ పోరాటానికి పార్టీ శ్రేణులు సిద్ధం కావాలి. జగన్అధికారం చేపట్టిన మూడేళ్లలో ఏడుసార్లు విద్యుత్చార్జీలు పెంచారు. విద్యుత్చార్జీల పెంపును ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి.విజన్ డాక్యుమెంట్ విడుదల విశాఖపట్నం రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తే విద్యుత్చార్జీలు పెంచం. వీలైతే తగ్గిస్తాం. 90వ దశకం చివరిలో విద్యుత్అంగంలో సంస్కరణలు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్అగ్రగామిగా ఉంది. సోలార్, విండ్ పంచ్ఎనర్జీ ఉత్పత్తి విధానాలతో యూనిటధర రూ.8 నుంచి రూ.2కు పడిపోయింది. హైడ్రోజన్, అమ్మోనియా హబ్లను ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్చార్జీలను 30 శాతం తగ్గించేందుకు ప్రయత్నిస్తాం.4 మార్చి 2024 పెనుగొండ ఎవరి మార్కు ఎంత అని అడుగుతున్నాడు.. నేను చెబుతున్నా జగన్.. నీ మార్కు తెలుసుకో. రూ.200 ఉండే కరెంటు బిల్లు రూ.800 చేయడం నీ మార్కు. కరెంటు చార్జీల బాదుడు నీ మార్కు..ఇలా ఎన్నికల సమయంలో ప్రతి చోటా మైకు పట్టుకుని గత ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచిందంటూ బాబు గగ్గోలు  ఊరూ వాడా బలపం కట్టుకుని చార్జీలు పెంచబోనంటూ ఊదరగొట్టిన చంద్రబాబు వినియోగదారులే విద్యుత్ ను అమ్మేలా చేస్తానని అబద్దపు మాటలు ఆరు నెలలు తిరక్కుండానే జనం జేబులకు చిల్లులు పడేలా కరెంటు చార్జీల వాత… • ఇందుకోసం వినియోగదారుల చార్జీల పేరుతో పట్టణ స్థానిక సంస్థలు సంస్కరణలు చేపట్టాలని దిశా నిర్దేశంఎప్పటికప్పుడు యూజర్ చార్జీల నిర్వహణ, ఆపరేషన్ వ్యయానికి తగినట్లుగా రుసుము పెంచాల్సి ఉందని చెప్పిన ప్రభుత్వం ప్రజలను ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ బాదేస్తున్న కూటమి ప్రభుత్వం. అని నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజి ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి .

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *