హైందవ శంఖారావం కర్నూలు జిల్లా, విస్తృత కార్యకర్తల సమావేశం
1 min readహైందవ శంఖారావం చలో విజయవాడ 5 వ తేదీ జనవరి 2025 బహిరంగ సభకు బస్సు Entry Pass, కార్లు Entry Pass, ప్రయాణికుల Identity Card ఆవిష్కరణ
తేదీ :- 25/12/24 బుధవారం
సమయం :- 10:00 ఉదయం నుండి 1:30 జరిగింది.
దేవి ఫంక్షన్ ప్యాలస్, నంద్యాల చెక్పోస్ట్ వద్ద ,కర్నూలు.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: విశ్వ హిందూ పరిషత్ హైందవ శంఖారావం కర్నూలు జిల్లా, విస్తృత కార్యకర్తల సమావేశం శ్రీ నంది రెడ్డి సాయి రెడ్డి విశ్వ హిందూ పరిషత్ దక్షిణాంధ్ర ప్రాంత అధ్యక్షులు, ప్రాణేష్ దక్షిణాంధ్ర ప్రాంత సహకార్యదర్శి, భాను ప్రకాష్ హైందవ శంఖారావం కర్నూలు జిల్లా కన్వీనర్, చంద్రశేఖర్ హైందవ శంఖారావం కర్నూలు జిల్లా సహా కన్వీనర్, హనుమంత్ రెడ్డి హైందవ శంఖారావం కర్నూలు జిల్లా సహా కన్వీనర్,ఈపూరి నాగరాజు హైందవ శంఖారావం కర్నూలు జిల్లా రవాణా ప్రముఖ్, శ్రీనివాస రాజులు హైందవ శంఖారావం కర్నూలు నగర రవాణా ప్రముఖ్, సాంగ్ రాంబాబు హైందవ శంఖారావం కర్నూలు నగర రవాణా సహ ప్రముఖ్, మహేష్ మంత్రాలయ రవాణా ప్రముఖ్, శివ రాముడు కోడుమూరు రవాణా ప్రముఖ్ తదితరులు ఆవిష్కరించారు. శ్రీ నంది రెడ్డి సాయి రెడ్డి మాట్లాడుతూ కర్నూలు మరియు ఆదోని జిల్లాల నుండి కనీసం 30 బస్సులు ,250 కార్లు, కర్నూల్ టు విజయవాడ స్పెషల్ ట్రైన్ 1300 మంది, వ్యక్తిగతంగా ట్రైన్ మరియు బస్సు ప్రయాణం చేసే ప్రతి ప్రయాణికుడికి వాహనాలకు పాస్ ఐడెంటి కార్డ్స్ లేకుండా విజయవాడ బహిరంగ సమావేశంలో అనుమతి ఉండదు కనుక ప్రతి ఒక్కరు తమ వాహనాలకు ముందు వెనక వాహన పాస్, రెండు జెండాలు, బ్యానర్లు ఉండేలా చూసుకోవాలి, కేంద్రం సూచించిన రూట్ మ్యాప్ ద్వారా సభా ప్రాంగణానికి చేరుకోగలరు, దక్షిణాంధ్ర రాయలసీమ ప్రాంతాల వరకు కేటాయించిన పార్కింగ్ ప్లేసులకు త్వరగా చేరుకొని సభను దిగ్విజయంగా పూర్తి చేసుకోగలరు, వాహనదారులు వాహనాల కండిషన్లు బాగుండేలా అవసరమైన స్టెప్ని జాకీ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా తెలిపారు, కావున ప్రతి ప్రయాణికుడు తమ వాహనానికి వాహన పాసులు ఐడెంటి కార్డ్స్ ఈ పూరి నాగరాజు రవాణా ప్రముఖు ని సంప్రదించవలసిందిగా తెలిపారు.