భక్తి శ్రద్దల నడుమ..క్రిస్మస్ పండుగ…
1 min readఫాదర్ మధుబాబు ఆధ్వర్యంలో 10 గ్రామాల్లో ప్రత్యేక ప్రార్థనలు..
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): ఏసుక్రీస్తు జన్మదిన క్రిస్మస్ పండుగను నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోని అన్ని గ్రామాల్లో క్రిస్మస్ పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. మిడుతూరు ఏబీఎం చర్చిలో జరిగిన క్రిస్మస్ పండుగ వేడుకల్లో నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య పాల్గొన్నారు.మండలంలోని ఉప్పలదడియ ఆర్ సీఎం విచారణ గురువులు ఫాదర్ మధుబాబు ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి నుండి బుధవారం సాయంత్రం దాకా గ్రామాల్లో ప్రత్యేకంగా ఫాదర్ మధుబాబు పూజలు నిర్వహించారు. ఉప్పలదడియ,కడుమూరు,పై పాలెం,49 బన్నూరు, చౌటుకూరు,దేవనూరు, దిగువపాడు,కేతవరం గ్రామాల్లో మంగళవారం రాత్రి నుండి చర్చీల దగ్గర చిన్నారులు యువకులు సంబరాలు జరుపుకున్నారు. అన్ని గ్రామాల్లో ఫాదర్ మధుబాబు దివ్య బలిపూ జను సమర్పించి క్రిస్మస్ పండుగ ఏసుక్రీస్తు జన్మదిన గురించి సందేశం ఇచ్చారు. తర్వాత చిన్నారులకు జ్ఞాన స్నానం ను ఇచ్చారు.చర్చిల్లో కేకులు కట్ చేసి ఒకరికొకరు సంతోషంగా పంచుకున్నారు. బుధవారం తెల్లవారు జామున గ్రామాల్లో పురవీధుల వెంట బాల యేసును భారీ ఊరేగింపుతో టపాకాయలు కాలుస్తూ సంబరాలు చేసుకుంటూ ఊరేగింపు చేశారు.