పేరుకే ఆర్.ఎం.పి ఎంబిబిఎస్ ఎండి స్థాయిలో వైద్యం
1 min readశివకుమారా మజాకా,
పైసలకు కక్కుర్తి పడి రోగులకు సలైన్ లెక్కిస్తూ.అధిక మోతాదు యాంటీబయోటెక్స్,
అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటం ..కన్నెత్తి చూడని జిల్లా వైద్య అధికారులు
పల్లెవెలుగు వెబ్ హోళగుంద: ఆర్.ఎం.పి ఎంబిబిఎస్ ఎండి స్థాయిలో వైద్యం చేస్తూ శివకుమార్ అనే ఓ ఆర్ ఎం పి డాక్టర్ పైసలకు కక్కుర్తి పడి అధిక మోతాదు గల యాంటీబయోటిక్స్ మందులు ఇస్తూ అమాయక ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్న జిల్లా వైద్య అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో మండల ప్రజలు మండిపడుతున్నారు హోళగుంద మండల పరిధిలోని హెబ్బటం గ్రామంలో శివ కుమార్ అనే వ్యక్తి పైసలకు కక్కుర్తి పడి ఏకంగా ఒక క్లినిక్ ఏర్పాటు చేసుకొని అందులో అధిక డోస్ గల వివిధ కంపెనీల యాంటీబయోటిక్స్ దర్జాగా పెట్టుకుని ఎంబిబిఎస్ ఎండి స్థాయిలో వైద్య సేవలు అందిస్తూ అమాయక గ్రామీణ ప్రాంత ప్రజలతో చెలగాటమాడుతున్నాడు ఆర్ ఎం పి అంటే( రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీస్) సదరు ప్రాక్టీసును ఎంబిబిఎస్ వైద్యుల దగ్గర పది సంవత్సరాలపాటు పనిచేసిన అనుభవం తో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి, అప్పుడు మాత్రమే ఆ ఆర్.ఎం.పి రోగులకు జ్వరం బాధపడుతూ తమ దగ్గరికి వస్తే పారాసిటమల్, టాబ్లెట్ మాత్రమే ఇవ్వాలి ఏదైనా ప్రమాదం జరిగి రక్త గాయాలతో తమ దగ్గరికి వస్తే కట్టులు కట్టి ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలకు రెఫర్ చేయాలని, రోగులకు వైద్య సేవలు అందించాలంటే బీఎస్సీ నర్సింగ్ అయిన పూర్తి చేసి ఉండాలని ప్రభుత్వ నిబంధనలు స్పష్టంగా ఉన్నప్పటికీ వాటిని తుంగలో తొక్కి ఇష్ట రాజ్యాంగ గొంతులో స్టెతస్కోప్, చేతిలో బిపి ఆపరేటర్ పెట్టుకుని పెట్టుకొని తాను ఏర్పాటు చేసుకున్న ఆసుపత్రిలో మంచం మీద రోగులకు సలైన్లు ఎక్కించడం, కాన్పులు చేయడం, సంతానం కలగని వారికి సంతాన సౌపల్యం కలిగిస్తామని అధిక మొత్తంలో పైసలు వసూలు చేస్తూ రోగులను నిలువు దోపిడీ గురి చేస్తూ ఆర్.ఎం.పి శివ కుమార్ ఎంబిబిఎస్ ఎండి స్థాయిలో వైద్యం చేస్తూ నేనింతే నేను ఎవ్వరికి భయపడను నన్ను ఎవరు ఏమి చేసుకోలేరు అనే ధీమా ఇతని నిర్వాహకం జిల్లా వైద్యాధికారులు ఎందుకు ఇలాంటి ఆర్ఎంపీ లపై చర్యలు తీసుకోలేకపోతున్నారు, అనే ప్రశ్న అందరిలో ఉంది.చిన్నపిల్లలు, మహిళలు పండు ముసలి వారికి సైతం అధిక మోతాదు గల యాంటీబయోటెక్స్ వాడకం అలవాటు చేయడం ద్వారా ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే ఆ రోగి పరిస్థితి అంతే!అధిక మోతాదు యాంటీబయాటిక్ వాడితే:- చిన్నచిన్న రోగాలకు అధిక మోతాదు గల వివిధ కంపెనీల యాంటీబయోటిక్ మందులు వాడితే దీర్ఘకాలిక రోగాల బారిన పడినప్పుడు ,ప్రమాదాలు సంభవించినప్పుడు, శాస్త్ర చికిత్సలు వంటివి చేయించుకున్నప్పుడు యాంటీబయోటిక్స్ మందులు వాడాలని వైద్య నిపుణులు చూచిస్తే అప్పుడు యాంటీబయోటెక్స్ మందులు పనిచేయవు ఆర్ఎంపీలు చేసిన పొరపాటుకు ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని వైద్యులు సూచిస్తున్నారు.
పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఆర్ఎంపీలు
పదవ తరగతి కూడా పూర్తి చేసి ఉండరు ఓ ఆర్ ఎం పి దగ్గర ప్రాక్టీస్ చేసి అరకొరకు మందుల పేర్లు తెలుసుకొని సంపాదనే దేయంగా ఆర్ఎంపీలు పుట్టుకొస్తున్నారని కంచె చేను మేసింది అన్న చందాగా సీనియర్ జూనియర్ ఆర్.ఎం.పి ల వల్ల రోగుల ప్రాణాలు గాలిలో కలిసి పోవాల్సిందేనా?
సిఐటియు జిల్లా కార్యదర్శి నారాయణస్వామి: ఆర్ఎంపీల వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు ఉంది, పుట్టగొడుగుల పుట్టుకొస్తూ త్వరగా రోగికి న్యాయం అయితే తమ దగ్గరికి వస్తారని అధిక మోతాదులు గల యాంటీబయోటిక్స్ మందులు అలవాటు చేస్తున్న ఆర్ఎంపీ లపై జిల్లా వైద్య అధికారులు చర్యలు చేపట్టకపోతే సిఐటియు సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతావని ఆయన హెచ్చరించారు.ఈ విషయంపై ఆదోని డిప్యూటీ డిఎంహెచ్వో ఇన్చార్జ్ బాలమురళిని వివరణ కోరగా ఆర్ఎంపీలు వైద్యం చేయరాదనీ, ప్రథమ చికిత్స చేయాలన్నారు. వైద్యం చేసే వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు.