చిలకలడోన లో భక్తిశ్రద్ధలతో మారెమ్మ అవ్వ దేవర
1 min readకుంభాలు, కలశములతో ఊరేగింపు
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : మండల పరిధిలోని చిలకలడోన గ్రామంలో మారెమ్మ అవ్వ దేవర మహోత్సవం గ్రామ ప్రజల అధ్వర్యంలో బుధవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా అమ్మ వార్ల దేవాలయం ను వివిద రకాల విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. గ్రామ ప్రజలు తెల్లవారుజామున నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ మారెమ్మ అవ్వ దేవమ్మ అవ్వ, తాయమ్మ అవ్వ లకు డప్పుల, బ్యాండ్ బాజా భజంత్రీలు మద్య కుంభాలతో, కలశము లతో ఊరేగింపు వెళ్లి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంత్రాలయం సిఐ రామాంజులు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.