క్రీస్తు జననం మానవాళికి పర్వదినం…..
1 min readజిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు… పరిగెల మురళీకృష్ణ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: క్రీస్తు జననం మానవాళికి పర్వదినమని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ,తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మాజీ సభ్యులు పరిగెల మురళీకృష్ణ అభిప్రాయపడ్డారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన క్రిస్మస్ పండుగ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. జిల్లా కాంగ్రెస్ సాంస్కృతిక విభాగం మాజీ అధ్యక్షులు కురవ నాగశేషు ఏసుక్రీస్తు కీర్తనలు ఆలపించారు. అనంతరం మురళీకృష్ణ మాట్లాడుతూ క్రీస్తు జన్మించిన రోజు ప్రపంచానికి పండుగ దినమని ప్రేమ మార్గంలో ఎవరి మనసు అయిన జయించవచ్చని, తన జీవితం ద్వారా నిరూపించిన క్రీస్తు మార్గంలో నడుస్తూ.. సాటి మనిషికి మేలు చేయడమే మన ముందున్న కర్తవ్యమని, ప్రేమ, కరుణ, సహనం, త్యాగం, గుణాలు అలవాటు చేసుకుని జీవితాన్ని శాంతిమయం చేసుకుందామని తెలియజేశారు. సర్వ మానవాళికి శాంతి సందేశాన్ని ఇచ్చిన యుగకర్త ఏసుక్రీస్తు జన్మించిన రోజు ప్రపంచానికి పండుగ రోజు అని పేర్కొన్నారు. క్రీస్తు మార్గాన్ని అనుసరించే వారందరికీ ప్రేమ పూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు మురళీకృష్ణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎన్ సీ బజారన్న, కే సత్యనారాయణ గుప్త, ఎన్ చంద్రశేఖర్, ఎస్ ప్రమీల, డివి సాంబశివుడు, షేక్ ఖాజా హుస్సేన్, షేక్ ఖాద్రి పాషా, సయ్యద్ నవీద్, కె నాగశేషు, బి సుబ్రహ్మణ్యం డబ్ల్యూ సత్యరాజు, అక్బర్ అక్బర్, నరసింహులు, రుక్సాన మొదలగు వారు పాల్గొన్నారు.