పిజిఆర్ఎస్ లో అందిన సమస్యలపై సత్వర పరిష్కారం
1 min readఅర్జీలను నాణ్యతతోపాటు నిర్ధేశిత సమయంలోగా పరిష్కరించాలి
207 అర్జీలు స్వీకరణ. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
పల్లెవెలుగు,ఏలూరు జిల్లా ప్రతినిధి: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (మీకోసంలో) అందిన అర్జీల పరిష్కారం జవాబుదారీతనంతో ఉండాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో అర్జీదారుల నుంచి 207 ధరఖాస్తులు స్వీకరించినట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, ఆర్డిఓ అచ్యుత అంబరీష్, డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, జెడ్పి సిఇఓ కె. సుబ్బారావు, డిప్యూటీ కలెక్టర్లు, కె. భాస్కరరావు, ఎం. ముక్కంటి లతో కలిసి ప్రజల నుండి పిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రజలు పిజిఆర్ఎస్ లో సమర్పించే అర్జీలకు సత్వర పరిష్కార దిశగా పనిచేయడం అత్యంత ప్రధానమన్నారు. అర్జీల పరిష్కారంలో సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. స్వీకరించిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు విచారణ చేపట్టి నిర్ధేశించిన సమయంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఫిర్యాదుదారులు విజ్ఞఫ్తులను అధికారులు క్షుణంగా పరిశీలించి రీఓపెనింగ్ లేకుండా చూడాల్సిన భాద్యత అధికారులపై ఉందన్నారు.
అందిన అర్జీల్లో కొన్ని…చింతలపూడి మండలం రేచర్ల గ్రామానికి చెందిన యం. లలిత సూర్యపద్మావతి అర్జీనిస్తూ ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘంలో తీసుకున్న మార్ట్ గేజ్ లోనును తీర్చివేశామని, అయితే ఈసి తీసుకున్నప్పుడు అందులో లోను చెల్లించవలసియున్నట్లు ఉందన్నారు. కావున ఈవిషయంపై విచారణ జరిపి లోన్ క్లియరెన్స్ సర్టిఫికెట్ జారీచేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. దెందులూరు మండలం కొత్తగూడెంకు చెందిన మాగుంట నాగేంద్రప్రసాద్ అర్జీనిస్తూ 22ఎ నిషేధిత జాబితాలోఉన్న తమ భూమిని సదరు జాబితా నుండి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఏలూరు రూరల్ మండలం కొమడవోలుకు చెందిన గుండిగుంట రక్మిణీదేవి అర్జీనిస్తూ తమ భూమికి సంబందించిన పట్టాదారు పాస్ పుస్తకం వన్ బి అడంగుళ్ లు ఆన్ లైన్లో నమోదు చేయాలని కోరారు. ఉంగుటూరు మండలం వెలమెల్లి గ్రామానికి చెందిన దండమూడి నాగేశ్వరరావు అర్జీనిస్తూ దుర్వినియోగమైన పంచాయితీ నిధులు విషయంపై విచారణ జరపాలని కోరారు. సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ వివిధ సెక్షన్ల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.