ఎంపీ తో కురువ క్యాలెండర్ వివాహ పరిచయ వేదిక కరపత్రం ఆవిష్కరణ
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా కురువ సంఘం. 2025 వ సంవత్సరం క్యాలెండర్ ను కర్నూలు ఎంపీ కార్యాలయంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు చేతుల మీదుగా ఆవిష్కరించారు.నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు కర్నూలు జిల్లా కురువ సంఘం అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న,ప్రధాన కార్యదర్శి ఎం. కె.రంగస్వామి మరియు కులస్థులతో ఎంపీ మాట్లాడుతూ జిల్లాలో ఎవరూ ఏ సమస్య వచ్చిన నా దృష్టికి తీసుకొని వస్తే తప్పకుండా పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. కర్నూలు నగరంలో బళ్లారి చౌరస్తా సమీపంలో కార్యాలయంలో అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కురువ కులస్తులు పాల సుంకన్న వెంకటేశ్వర్లు, చిరంజీవి,కెసి నాగన్న, తిరుపాల్, అల్ల బాబు, బాలరాజు, శ్రీలీల, కె. అనిత ,తదితరులు పాల్గొన్నారు.