టిడిపి అధ్యక్షులు పాలకుర్తి తిక్కా రెడ్డి ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: జిల్లా తెలుగుదేశంపార్టీ కార్యాలయం, కర్నూలు నందు కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు శ్రీ పాలకుర్తి తిక్కా రెడ్డి ని కుడా చైర్మన్ శ్రీ సోమిశెట్టి వెంకటేశ్వర్లు , రాష్ట్ర ఆర్యవైశ్య కార్పోరేషన్ డైరెక్టర్ నంద్యాల నాగేంద్ర, రాష్ట్ర పార్టీ కార్యదర్శి వై.నాగేశ్వర రావు యాదవ్, రాష్ట్ర లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి చంద్రశెఖర్ మొదలగు వారితో పార్టీ జిల్లాలోని వివిధ నియోజకవర్గముల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేడమైనది. ఈ సంధర్బంగా పాలకుర్తి తిక్కా రెడ్డి మాట్లాడుతొ గత 2024 కు వీడ్కోలు పలుకుతూ 2025లోకి విచ్చేయడం శుభపరిణామం అని, ప్రపంచవ్యాప్తంగా ఆంగ్ల నామ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం, అందులో భాగంగా జిల్లాలో ప్రజలు అధికారులు నాయకులు కార్యకర్తలు, అభిమానుల మధ్యన నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం మంచి సంతృప్తిని అందిస్తుందని.. 2024 లోని చేదు జ్ఞాపకాలను దూరం చేస్తూ 2025 లో అందరికీ మంచి చేకూర్చాలని, ఈ సంవత్సరం ప్రజలందరూ వారు అనుకున్నటువంటి లక్ష్యాలను చెరువు అయ్యి విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ, ప్రజలందరూ కూడా అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆర్థికంగా స్థిరపడి వారు ఎంచుకున్నటువంటి మార్గంలో ముందుకు వెళుతూ విజయాలు సాధించాలని తనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా తిరిగి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్నటువంటి అన్ని సంక్షేమ పథకాలను అర్హులైనటువంటి సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు అందిస్తానని, అదేవిధంగా ఈ నియోజకవర్గ అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం నుండి విజయవాడ నగరపాలక సంస్థ నుండి నిధులు తీసుకొని వచ్చి అభివృద్ధి చేస్తానని శుభాకాంక్షలు తెలియజేసిన ప్రజలకు భవిష్యత్తు ప్రణాళికను వివరిస్తూ తెలియజేయడం జరిగినది.