ఉత్సాహంగా నూతన సంవత్సర వేడుకలు..
1 min readపల్లెవెలుగు వెబ్ ఆలూరు: నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలి..-వైకుంఠం ప్రసాద్ , వైకుంఠం జ్యోతి …ఆలూరు పట్టణం లోని గెస్ట్ హౌస్ నందు ఘనంగా నూతన సంవత్సర వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. కార్యకర్తలు అభిమానులు నాయకులు అధికారులతో సందడి వాతావరణం నెలకొంది. కార్యకర్తలు నాయకుల మధ్య కేకును కట్ చేసి నూతన సంవత్సర వేడుకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యనిరర్వాహక కార్యదర్శి వైకుంఠం శివ ప్రసాద్ &టీడీపీ మహిళా నాయకురాలు శ్రీమతి వైకుంఠం జ్యోతి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వైకుంఠం ప్రసాద్ మాట్లాడుతూ ఆలూరు నియోజకవర్గం ప్రజలందరికీ హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ 2025వ సంవత్సరం మన ఆలూరు నియోజకవర్గం ప్రజలందరికీ మంచి జరగాలని అందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా భగవంతుని ప్రార్ధిస్తున్నానన్నారుఈ నూతన సంవత్సరంలో రైతులందరికీ మంచి పంటలు పండాలని, రైతులందరూ లాభదాయకంగా ఉండాలని రైతులు బాగున్నప్పుడే దేశ,రాష్ట్ర ప్రజలు అందరూ బాగుంటారని ఆయన తెలియజేశారు.నియోజకవర్గమును పూర్తి స్థాయిలో అభివృద్ది పరచుటకు తన వంతు కృషి చేస్తానని ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడతానాని ఆయన తెలిపారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలను ఏవైనా సరే తమ దష్టికి తీసుకువస్తే వెంటనే వాటి పరిష్కారానికి కృషి చేసి సమస్యలు తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.అయితే పూలదండలు గాని,పూల బొకేలు గాని తీసుకురావద్దని చెప్పిన వైకుంఠం ప్రసాద్ విజ్ఞప్తి మేరకు అభిమానులందరూ పుస్తకాలు, పెన్నులు, తీసుకుని వచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు.ఈ కార్యక్రమం లో అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు &తదితరులు పాల్గొన్నారు.